Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

by CVR NEWS
కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, క‌మిటీల ఏర్పాటు, నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పార్టీ బ‌లోపేతం లాంటి అంశాల‌పై చ‌ర్చించారు. పార్లమెంట్ నియెజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రత్యేక క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ప‌న‌వ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి క‌మిటీలో మొత్తం ఏడుగురు స‌భ్యులు ఉండేలా రూప‌క‌ల్పన చేశారు. ఈ క‌మిటీల్లో సంబంధిత పార్లమెంట్ నియెజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియ‌ర్ నాయ‌కులు, మ‌హిళా నేత‌ల‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అంతేకాకుండా 2014 నుంచి జ‌న‌సేన కోసం ప‌నిచేస్తున్న నాయ‌కుల‌తో పాటు ఇద్దరు సాధ‌క్ లకు కూడా క‌మిటీల్లో స్థానం క‌ల్పించాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి క‌మిటీలో 10 నుంచి 25 మంది సాధ‌క్‌లకు సమన్వయ బృందంగా స‌హ‌క‌రించేలా వ్యవ‌స్థ రూపొందించ‌నున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ నియెజ‌క‌వ‌ర్గ క‌మిటీల్లో చోటు ద‌క్కాల‌ని అనుకునే నాయ‌కుల నుంచి దర‌ఖాస్తులు సైతం స్వీక‌రించ‌నున్నారు. ఆ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి స‌మ‌గ్ర నివేదిక రూపంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అంద‌జేస్తారు. ఈ నివేదిక‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని ప్రత్యేక క‌మిటీ ప‌రిశీలించిన త‌ర‌వాత నియామ‌కాల‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ‌ను నాలుగువారాల్లో పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ కల్యాణ్ నేత‌ల‌కు ఆదేశించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014519
Total views : 80417

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.