Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..

బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..

by CVR NEWS
బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్

భారత్‌లో కాస్మెటిక్ ఇంజెక్షన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ.. ఇంజెక్షన్ రూపంలో ఉపయోగించే ఎలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేయడం,దిగుమతి చేసుకోవడం, వినియోగించడం అనుమతించబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నోటీసు విడుదల చేసింది.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 ప్రకారం కాస్మెటిక్స్ అంటే శరీరాన్ని శుభ్రపరచడం,అందంగా చూపించడం,ఆకర్షణ పెంచడం లేదా రూపాన్ని మార్చేందుకు బయటకు రాసుకునే ఉత్పత్తులేనని డీసీజీఐ పేర్కొంది.
అయితే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఉత్పత్తులు కాస్మెటిక్స్ నిర్వచనంలోకి రావని తెలిపింది. అందువల్ల బ్యూటీ క్లినిక్స్, ప్రొఫెషనల్స్ లేదా వినియోగదారులు కాస్మెటిక్ ఉత్పత్తులను ఇంజెక్షన్ల రూపంలో ఉపయోగించరాదని హెచ్చరించింది. కాస్మెటిక్ ఉత్పత్తులను శరీరంపై రాసుకోవడం, చల్లడం లేదా స్ప్రే చేయడానికే అనుమతి ఉంటుందని, చికిత్స కోసం లేదా ఇంజెక్షన్ ద్వారా ఉపయోగించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. అలాగే నిషేధిత పదార్థాలను ఉపయోగించడం, తప్పుడు ప్రచారం చేయడం, లేబుళ్లపై తప్పుదారి పట్టించే వివరాలు ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమని పేర్కొంది. తయారీదారులు ఉత్పత్తులపై ఇచ్చిన వివరాలను ఎవరూ మార్చకూడదని డీసీజీఐ ఆదేశించింది. కాస్మెటిక్ ఉత్పత్తులు వైద్య చికిత్సలకు ఉపయోగపడతాయని చెప్పడం లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం పై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: