Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Crime కర్ణాటకలో తీవ్ర విషాదం.ఆల్చిప్పల కోసం నదిలో దిగి 8మంది మృతి..

కర్ణాటకలో తీవ్ర విషాదం.ఆల్చిప్పల కోసం నదిలో దిగి 8మంది మృతి..

by CVR NEWS
కర్ణాటకలో తీవ్ర విషాదం

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో శిరాలి ప్రాంతంలోని పడుశిరాలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 14 మంది వెంకటాపుర నదిలో ఆల్చిప్పల్ని సేకరించేందుకు పడవలో వెళ్లారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా నది నీటిప్రవాహం పెరగడంతో పడవ నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు. మరోవైపు నదిలో మరికొందరు కొట్టుకుపోగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో మరణించినవారిని లక్ష్మీ మహాదేవ నాయక్ , లక్ష్మీ శివరామ్ నాయక్ , ఉమేష్ మంజునాథ్ నాయక్ , మస్తమ్మ మంజునాథ్ నాయక్, లక్ష్మీ అన్నప్ప నాయక్ , జ్యోతి నాగప్ప నాయక్ , మాలతి జట్టప్ప నాయక్ గా గుర్తించారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. గాయపడిన ఇద్దరు మహిళలను మెరుగైన చికిత్స కోసం ఉడుపిలోని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

040997
Total views : 212604

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: