Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం-బీజేపీ చీఫ్..

రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం-బీజేపీ చీఫ్..

by CVR NEWS
రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం-బీజేపీ చీఫ్

రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం అవుతుందని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. దేశం ప్రస్తుతం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేస్తామని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అసభ్య పదజాలంతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కలుషిత రాజకీయాలకు ముగింపు పలకాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ దిశగా మేధావులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని రామచందర్ రావు కోరారు.హైదరాబాద్ నగర పాలక సంస్థలో మజ్లిస్ పార్టీని ఓడించి మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019425
Total views : 90699

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.