Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఊరట ..

హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఊరట ..

by CVR NEWS
హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఊరట

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది! భాగ్యనగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రోకు ఏకంగా రూ.13,600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ లభించింది. న్యూఢిల్లీ వేదికగా.. ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సమక్షంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది.అయితే ఈ డీల్ వెనుక ఉన్న అసలైన మైలురాయి ఏంటంటే.. లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ నుంచి 100 శాతం యాజమాన్య హక్కులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి. అంటే.. ఇకపై హైదరాబాద్ మెట్రో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కీలక ప్రజా రవాణా ఆస్తిగా మారబోతోంది.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణ రావు స్పష్టం చేశారు. 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో కుదిరిన ఈ రుణ ఒప్పందం వల్ల మెట్రోపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా.. భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు విపరీతమైన ఆర్థిక వెసులుబాటు కలగనుంది. తద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019538
Total views : 91012

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.