Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..

హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..

by CVR NEWS
హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్

అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు , స్థానిక సమాచారంతో నిందితులను గుర్తించారు.కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు దాడికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019508
Total views : 90869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.