Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Agriculture కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.

by CVR NEWS
కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది. గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని, గత చైర్మన్‌ల ఆధీనంలో ఉన్న వసూళ్లతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల చోటుచేసుకున్నట్లు సమాచారం. సెక్రటరీకి ఉండాల్సిన అధికారాలను ఆమె స్వయంగా తీసుకుని, తనకు అనుకూల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. అలాగే సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి జరగాలని నియమం ఉండగా, చైర్మన్ ప్రత్యేక నిర్ణయాల ద్వారా వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా వ్యవహరిస్తే రైతుల సంక్షేమం మైనది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చైర్మన్ సొంతగా తీసుకునే నిర్ణయాలు స్థానికంగా రాజకీయ చర్చలకు కారణమవుతోంది.

చైర్మన్ అలేఖ్య వ్యవహారంపై డైరెక్టర్లు మంత్రి కి ఫిర్యాదు చేసారని, వెంటనే ఆమెను పదవీ నుంచి తొలగించమని కోరారని సమాచారం. రైతుల సమస్యలు, ఎఫ్‌సిఐ గోదాముల వినియోగం, మార్కెట్ వసూళ్ల నిర్వహణ వంటి అంశాల్లో ఆమె నిర్ణయాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య మరింత కఠినంగా మారింది. మార్కెట్ కమిటీలో అధికారాలను దుర్వినియోగం చేయడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్థానిక వ్యవస్థాపకులు, డైరెక్టర్లు భయపడుతున్నారని టాక్ నడుస్తుంది . అవసరమైన సంతకాలు చేయడంలోనూ , నిర్ణయాలు తీసుకోవడంలోనూ విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలేఖ్య తన విధులను సరియైన విధంగా నిర్వహించి, ప్రతి నిర్ణయాన్ని డైరెక్టర్లతో చర్చించి, రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు ఆసక్తిగా మారింది .

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019390
Total views : 90650

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.