Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Crime మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.

మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.

by CVR NEWS
మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు

ఈశాన్య మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది. మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అలాగే 75 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 46 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా స్థానికంగా 100 కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
చైనా సరిహద్దుకు దక్షిణంగా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్ కామ్ టౌన్ షిప్ లోని కౌంగ్ టూప్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే సాయుధ తిరుగుబాటు సమూహం ఆధీనంలో ఉంది.ప్రమాద సమయానికి ఈ భవనంలో పేలుడు పదార్థాలు ఉన్నప్పటికీ అసలు పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019369
Total views : 90570

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.