Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Crime జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

by CVR NEWS
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు యువకులను సురక్షితంగా బయటకు తీసినా, అరుణ్ మాత్రం కారులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటలపాటు కష్టపడి బావిలో నుంచి కారును బయటకు తీశారు. అనంతరం కారులో చిక్కుకున్న అరుణ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో మోరపెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019461
Total views : 90752

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.