Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.

ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.

by CVR NEWS
ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి

ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ప్రతిపాదిత బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జడ్చర్లలోని కల్వకుర్తి ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020156
Total views : 92310

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.