Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీ గంజాయి పట్టివేత.

పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీ గంజాయి పట్టివేత.

by CVR NEWS
పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీ గంజాయి పట్టివేత

పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఎటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది.ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా నుంచి తెలంగాణకు టాటా మాంజా కారులో తరలిస్తున్న 116 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 5 లక్షల 60 వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు.ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పైలట్‌గా వ్యవహరించిన హోండా యూనికార్న్ ద్విచక్ర వాహనంతో పాటు టాటా మాంజా కారును పోలీసులు సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎటపాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. కృష్ణ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: