Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Latest News జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.

జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.

by CVR NEWS
జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్

జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒకే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ, ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్ఐ షేక్‌ హమీద్‌లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఒకే కేసు వ్యవహారంలో ఇద్దరు ఉన్నతాధికారులు ఏకకాలంలో సస్పెండ్ కావడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నర్మెట సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ అబ్బయ్య, ఎస్ఐ షేక్ హమీద్ గతంలో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. ఆ సమయంలో పోచన్నపేట గ్రామానికి చెందిన ఒక వివాదాస్పద కేసు విషయంలో వీరిద్దరి తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, ఇద్దరు అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారంటూ వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన వరంగల్ సీపీ.. సదరు కేసుపై అంతర్గతంగా సమగ్ర విచారణ జరిపించారు. ఈ విచారణలో సీఐ అబ్బయ్య, ఎస్ఐ హమీద్ ఇద్దరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు, విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గానూ వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖలో అవినీతికి, అక్రమాలకు తావులేదని.. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా ఉన్నతాధికారులు గట్టి సంకేతాలు పంపినట్లయింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035654
Total views : 180099

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.