209
హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు అంబులెన్సులకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ యంత్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు విస్తృతంగా రుణాలు అందించాలని, లాజిస్టిక్ పార్కులు, గోదాములు, రైస్ మిల్లుల ఏర్పాటుకు బ్యాంకులు సహకరించాలని పిలుపునిచ్చారు.