Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News హైదరాబాద్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పర్యటన.

హైదరాబాద్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పర్యటన.

by CVR NEWS
హైదరాబాద్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పర్యటన

దేశంలో శాస్త్రీయ పరిశోధన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. హైదరాబాద్‌ సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ లో నాలుగు అత్యాధునిక పరిశోధన కేంద్రాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అలాగే రూపుదిద్దుకోనున్న సరికొత్త విద్యార్థి హాస్టల్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి… ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పరిశోధనలే దేశ ఆర్థికాభివృద్ధికి, సాంకేతిక స్వావలంబనకు బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు ఐఐసీటీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా మంత్రి
కొనియాడారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: