53
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం వద్ద కాసేపట్లో జరగనున్న జల హారతి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
సూపర్ ఎల్‌నినోతో రాష్ట్రంలో చుక్క నీరు కూడా లేని పరిస్థితి ఉందని..నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లోనూ నీళ్లు లేవన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపే ఇవాళ రైతాంగానికి పట్టిసీమ ప్రాణం పోస్తోందన్నారు. పోలవరం పూర్తయ్యలోపు పట్టిసీమ ద్వారా నీళ్లు పంపిస్తుంటే, పట్టిసీమను ఒట్టి సీమని మాట్లాడిన జగన్ కృష్ణానది ఒడ్డుకొచ్చి ఇవాళ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కరువు కాటాకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనే ఆలోచన ఆయనది అని విమర్శించారు. రైతు ద్రోహి జగన్‌కు పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత కూడా లేదని ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు.




Total views : 212267