Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News హైదరాబాద్‌ రామంతాపూర్‌లో SOT పోలీసుల దాడులు.

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో SOT పోలీసుల దాడులు.

by CVR NEWS
హైదరాబాద్‌ రామంతాపూర్‌లో SOT పోలీసుల దాడులు

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ పేరుతో నడుస్తున్న ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌లో తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన డ్రైఫ్రూట్స్‌తో పాటు లేబుల్ లేని పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో 2 కిలోల ఫంగస్ పట్టిన ఎండు అంజీర్, గడువు ముగిసిన త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్, వీకేఎల్ ఫుడ్ ఫ్లేవర్, నాలుగు బాక్సుల ఐడాకాల్ సింథటిక్ ఫుడ్ కలర్, నాలుగు డబ్బాల గడువు ముగిసిన లూజ్ సింథటిక్ ఫుడ్ కలర్, 1.5 కిలోల లూజ్ టూటీ ఫ్రూటీ స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ ఐస్‌క్రీమ్ తయారీలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు.సీజ్ చేసిన పదార్థాలతో పాటు యూనిట్ నిర్వాహకుడు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040864
Total views : 212240

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: