డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి సమస్య రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది కొత్తపేట మండలంలోని కొత్తపాలెం, మసాయిపేట, ఎలిశెట్టివారిపాలెం, నక్కవారిపేట, డేగలవారిపాలెం, వాకాడవారిపాలెం తదితర గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది.సుమారు 70 ఎకరాల వ్యవసాయ భూములకు ఆధారమైన ప్రధాన కాలువలో నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ కాలువలో చుక్క నీరు కూడా లేకపోవడంతో నారుమడులు వేయలేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ పనుల కోసం ఇప్పటికే అప్పులు చేసిన తమకు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
రైతుల సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నించినప్పటికీ అధికారులు తన మాటను కూడా పట్టించుకోవడం లేదని నీటి సంఘం డైరెక్టర్ ఎలిశెట్టి వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరగకపోవడంతో నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు తక్షణమే స్పందించి కాలువకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.





Total views : 212200