Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh కడప జిల్లాలో రెండో రోజు మంత్రి లోకేష్ పర్యటన.

కడప జిల్లాలో రెండో రోజు మంత్రి లోకేష్ పర్యటన.

by CVR NEWS
కడప జిల్లాలో రెండో రోజు మంత్రి లోకేష్ పర్యటన

కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కడప జిల్లాలోని మైలవరం మండలం, చిన్నకొమెర్ల సమీపంలో ప్రతిష్టాత్మక దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. కాగా, దాల్మియా సిమెంట్ సంస్థ తన రెండో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏకంగా 3 వేల 100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ విస్తరణ పనులను చేపడుతోంది. ఈ ప్లాంట్ విస్తరణ పనులు పూర్తి కావడం ద్వారా స్థానికంగా కొత్తగా 700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. శంకుస్థాపన ఏపీని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్‌ తెలిపారు.రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు సొంత జిల్లాల్లోనే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని, దాల్మియా సిమెంట్ విస్తరణకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040829
Total views : 212134

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: