Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Devotional టీటీడీ ట్రస్టులకు రికార్డ్‌ స్థాయిలో విరాళాలు.

టీటీడీ ట్రస్టులకు రికార్డ్‌ స్థాయిలో విరాళాలు.

by CVR NEWS
టీటీడీ ట్రస్టులకు రికార్డ్‌ స్థాయిలో విరాళాలు

కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. నిత్యం కల్యాణం పచ్చ తోరణంలా కళకళలాడుతూ ఉంటుంది. నిత్యం లక్షలాదిమంది భక్తులు వెంకన్న దర్శనానికి బారులు తీరుతారు. శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో జులై 14న మంగళవారం ఒక్కరోజే టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. రికార్డు స్థాయిలో దాదాపు రూ. 96.98 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలిపారు.

ఆన్ లైన్ ద్వారా 2వేల 354 మంది దాతలు విరాళాలు సమర్పించారని..ఆఫ్ లైన్ ద్వారా 106 మంది దాతలు విరాళాలు సమర్పించారని తెలిపారు టీటీడీ అధికారులు.1212 మంది దాతలు లక్ష నుంచి‌ 10 లక్షల లోపు విరాళం సమర్పించగా…1246 మంది భక్తులు 10 లక్షల నుంచి 25 లక్షల లోపు విరాళం సమర్పించినట్లు తెలిపారు అధికారులు. ఇద్దరు భక్తులు కోటి ..అంతకంటే ఎక్కువ విరాళం సమర్పించారని తెలిపారు. పాత ప్రివిలేజెస్‌ గడువు ముగుస్తుండటం..కొత్త డోనర్ పాలసీ అమలు కావడంతో…పెద్దమొత్తంలో దాతలు విరాళాలు సమర్పించినట్లు తెలుస్తోంది. సామాన్యభక్తుల భవిష్యత్తు దర్శనాలను దృష్టిలో పెట్టుకొని డోనర్ ప్రివిలైజెస్ లో మార్పులు చేసినట్లు తెలిపింది టీటీడీ.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040827
Total views : 212089

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: