35
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది గాయపడ్డారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఘటన అనంతరం భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.ఈ ఘటనతో బన్ను జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు, పోలీస్ స్టేషన్లు మరియు కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.





Total views : 212191