Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.

అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.

by CVR NEWS
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు, నారాయణలను ఈ కేసులో దౌర్జన్యపూరితంగా నిందితులుగా చేర్చారని హైకోర్టు స్పష్టం చేసింది. నాటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని, దాని వెనుక కేవలం దురుద్దేశం మాత్రమే ఉందని కోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వాలు తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఒకవేళ ప్రతి నిర్ణయానికి ఇలాగే నేరాలను ఆపాదిస్తూ పోతే, అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అమరావతి భూములకు సంబంధించి నాటి ప్రభుత్వం చట్ట నిబంధనలను అనుసరించే జీవో 141ని తీసుకువచ్చిందని కోర్టు స్పష్టం చేసింది. ఈ జీవో వల్ల తాము నష్టపోయామంటూ అసలైన భూ యజమానులు గానీ, రైతులు గానీ ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని ఈ సందర్భంగా గుర్తుచేసింది. సీఆర్డీఏ పరిధిలో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చట్టపరమైన రక్షణ ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం అధికారులను లేదా ప్రజాప్రతినిధులను ఇలాంటి నిర్ణయాలపై ప్రాసిక్యూట్ చేయడాన్ని చట్టం నిషేధిస్తుందని స్పష్టం చేసింది. చంద్రబాబు, నారాయణలపై మోపిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పిన ఏపీ హైకోర్టు… వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ సదరు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తన తుది తీర్పులో ప్రకటించింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040980
Total views : 212575

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: