Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో క్లౌడ్‌బరస్ట్.

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో క్లౌడ్‌బరస్ట్.

by CVR NEWS
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో క్లౌడ్‌బరస్ట్

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్‌బరస్ట్‌తో వరదలు ఉద్ధృతంగా ప్రవహించి అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి విషమించడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

రాజౌరీ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు క్లౌడ్‌బరస్ట్ సంభవించి భారీ వరదలు వెల్లువెత్తాయి. వరద ఉధృతికి వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగిపోగా, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరదల ధాటికి రాజౌరీలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. బేలా బస్టాండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోవడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది.

అప్రమత్తమైన అధికారులు వెంటనే రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042041
Total views : 221458

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: