Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.

by CVR NEWS

అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రిలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం, సిబ్బంది సమన్వయంపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆదర్శంగా నిలవాలని పట్టాభిరామ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042263
Total views : 223604

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: