అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని వాణి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ నవీద్..గతంలో నగరంలోని ఒక ప్రముఖ ఫార్మా ల్యాబ్‌లో పని చేశారు. ఇటీవల అమెరికాలోని మెర్క్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆయన తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నవీద్ భార్య నజియా, కుమార్తె హఫీజా షేక్, కుమారుడు హఫీజ్ ఒమర్ మృతి చెందారు. నవీద్‌తో పాటు ఆయన చిన్న కూమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో బంధువులు, కుటుంబ సభ్యులు నవీద్ నివాసానికి చేరుకొని వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలో ముగ్గురు మృతి.
19
previous post




Total views : 223595