14
కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. కెనడా, అమెరికాలతో సరిహద్దు పంచుకుంటున్న ‘లేక్ ఆంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మార్చే ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ఇకపై ఆంటారియోతో పెద్దగా వాణిజ్యం చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ అగ్రరాజ్యం తమపై సుంకాలను విధిస్తే.. ఆ దేశానికి విద్యుత్తు సరఫరాను నిలిపేస్తామని, కీలక ఖనిజాల ఎగుమతిని ఆపేస్తామని ఆంటారియో ప్రభుత్వాధినేత డగ్ ఫోర్డ్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది.