Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

by CVR NEWS

దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్, ఆ తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టలేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చే నెల భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. ఈ పర్యటన ఖరారైతే, 2019లో జరిగిన చివరి భారత పర్యటన తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి అవుతుంది. అయితే, ఈ పర్యటనపై భారత్ లేదా చైనా ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: