తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా రాజ్య మేలుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాలన్న, మృతి చెందిన వారి మృతదేహాన్ని ఇంటికి చేర్చాలన్న ప్రతిఒక్కరూ అంబులెన్స్ పై ఆధారపడతారు. ప్రజల అవసరాలను పావుగా వాడుకొని, అంబులెన్స్ మాఫియా రాబందుల్లా తయారైనది. గత ప్రభుత్వ హయాంలోని రాజకీయ నాయకుల మద్దతుతో ఈ మాఫియా విషనాగుగా తయారై ప్రజల నిస్సాహాయతపై కాటు వేస్తున్నారు. శవాల మీదా డబ్బులు ఏరుకోవడం అంటే ఏమిటో అప్పటి వైసిపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు ప్రత్యక్షంగా చూసారు. ఇంత జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోవాల్సిన రుయా సూపర్నంట్ అధికారులు నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని,మృతి చెందిన మృతదేహాలను, సైతం అంబులెన్స్ సహాయంతోనే గమ్యస్థానాలకు చేరుస్తారు.
మృతి చెందిన కుటుంబాలు పుట్టాడు దుఃఖంతో ఉన్న అవేమీ పట్టించుకోకుండా పైసానే పరమావధిగా భావించి వారి దగ్గర ముక్కు పిండి మరి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా గత ప్రభుత్వ వాసన వీడటం లేదని తిరుపతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చామంతి శ్రీనివాస్ మండిపడ్డారు.. ఈ దారుణాంపై వెంటనే చర్యలు తీసుకోవాలని . రుయా సూపర్డెంట్ ను విజ్ఞప్తి చేశారు. పేదల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు బిజెపి నాయకులతో కలసి వినతి పత్రం అందజేశారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి