మహిళా సాధికారత కోసం ఎల్లప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ను కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా కుప్పం పర్యటనకి వచ్చినపుడు మహిళలు చాలా మంది తమకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కావాలని కోరారు. ఉచిత శిక్షణ కేంద్రం కుప్పంలో ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ని కట్టుబడి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎల్లప్పుడు ముందుంటారని తెలిపారు. భవిషత్తులో కూడా మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి మరింత చేయూత అందిస్తామన్నారు. ఒక్క సెంటర్లో రోజుకి యాభై మంది మహిళలకు శిక్షణ ఇస్తామని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Chittoor
తిరుమల శ్రీవారి (TTD) ని గామి చిత్ర బృందం (Gami Film Team) సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకులు విశ్వక్ సేన్., కథానాయకి చాందిని చౌదరి., దర్శకుడు విద్యాధర్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ…. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గామి సినిమాని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ముందుకు రానున్నట్లు తెలిపారు. అనంతరం చిత్ర కథానాయకి చాందిని చౌదరి మాట్లాడుతూ…. గామి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అని అన్నారు. రానున్న రెండు నెలల్లో మూడు సినిమాలు విడుదల కానున్నట్లు తెలిపారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి ఎంపీ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మహిళా బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్పా అని ప్రశ్నించారు. వి ఐ-టీడీపీ., జనసేన సోసియల్ మీడియా ఎంత ఘోరంగా., వల్గర్ గా వేధింపులకు గురి చేసి చంపేశారని ఆరోపణలు చేశారు. మహిళను గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
గీతాంజలి చావుకు కారణమైన వారికి కఠినమైన శిక్ష ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించానని తెలిపారు. ఐ-టీడీపీ., జనసేన సోసియల్ మీడియా బుద్ధి తెచ్చుకొని హద్దుల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను చులకనగా చూసే జనసేన టీడీపీ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వార్డ్ మెంబర్ గా గెలవలేని లోకేష్ కు జగన్ తో పోటీ పడే శక్తి లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను ఎదుర్కోలేక అందరూ ఏకమై గుంపుగా వస్తున్నారన్నారు. ఎంతమంది కూటమిగా ఏర్పడిన జగన్ ను అడ్డుకునే శక్తి లేదన్నారు. సీఎం జగన్ దమ్మున నాయకుడని…రెండవ సారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.
ఇదిచదవండి : మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
చదువు కోసం తిరుపతికి వలస వచ్చి… ఇద్దరు కామాంధుల చేతులలో బలైన మైనర్ బాలిక ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యం పోలీసుల వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కుటుంబం తిరుపతిలో కాపురముంటోంది. వారికి తొమ్మిదో తరగతి చదివే కుమార్తె ఉంది. ఆరు నెలల క్రితం ఆ బాలికకు మహ్మద్ షఫీ అనే యువకుడు ట్రైన్లో పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది ప్రేమ ముసుగులో మైనర్ బాలిక బాగా డబ్బులు కలిగిన అమ్మాయిగా గుర్తించి ఆ మైనర్ బాలుక ఇంటిలో నుంచి నగలు నగదు తెప్పించుకుని జల్సాలకు పాల్పడ్డాడు షఫీ.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
మరుసటి రోజు కూడా స్వామీజీ వారికి ఫోన్ చేసి ఆలయానికి రావాలని ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 21న రాత్రి ఆ బాలిక తండ్రితో కలిసి అక్కడకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే తన ప్రియుడు షఫీకి తెలియజేసింది. దీంతో షఫీ, నెల్లూరుకు చెందిన తన స్నేహితులు షామీర్, సంతోష్ తో కలసి అక్కడికి చేరుకుని మైనర్ బాలికను అక్కడినుంచి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ప్రియుడు షఫీ తన స్నేహితులు తన వద్ద అసభ్యంగా ప్రవర్తించడం అఘాయిత్యానికి పాల్పడటంతో తల్లిదండ్రులకు సమాచారం చేరవేసింది మైనర్ బాలిక. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గాజుల మండ్యం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఫిబ్రవరి 29న ఆమె మంచిర్యాలలో ఉన్నట్లు గుర్తించారు.
అక్కడినుంచి మైనర్ బాలికను తీసుకొచ్చి వైద్య పరీక్షల ఆధారంగా లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. విచారణలో బాలిక తనపై మూర్తిస్వామి కూడా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామి, అభిరామ్ అలియాస్ మహమ్మద్ షఫీల పై పలు సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 366, 376(2), 506 r/w 34 IPC & 3 r/w 4,5 r/w 6 0f POCSO ACT 2012 కిడ్నాప్, రేప్, ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మహమ్మద్ షఫీ అలియాస్ అభిరామ్, అతని స్నేహితులు షమర్, శరత్ లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న ఆశ్రమ నిర్వాహకుడు మూర్తిస్వామి కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలుస్తుంది. మూర్తి స్వామి అలియాస్ కోదండ రామాచార్యులు మారిషస్ లో ఉన్నట్లు సమాచారం.
ఇదిచదవండి : కేసీఆర్ లోక్సభ ఎన్నికల కదనభేరీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
చిత్తూరు జిల్లా, కుప్పం, తెరపైకి ప్రోటోకాల్ వివాదం(Protocol Conflict)
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి పెద్దిరెడ్డి మనవడితో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శిలాఫలకంలో ఎక్కడ వేయాలో అధికారులకు తెలియదు గానీ మంత్రి మనవడితో ప్రారంభోత్సవాలు చేస్తారా అంటూ ఎమ్మెల్సీ కంచర్ల పైరయ్యారు. మంత్రి మనవడికి ఏ ప్రోటోకాల్ ఉందో తమకు తెలియదన్నారు. కుప్పంలో అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారపక్షం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కంచర్ల డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
చిత్తూరు జిల్లా, పలమనేరు వద్ద యువకుడి హత్య కలకలం రేపుతోంది. పలమనేరు సమీపంలోని గాంధీనగర్ దగ్గర పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన శివశంకర్ కొడుకు వినయ్ హత్యకు గురైనట్లు పోలీసులు సోమవారం గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన పలమనేరు పోలీసులు, పంచనామా అనంతరం ప్రభుత్వాసుపత్రి లోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ని ఎవరైన హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. పలమనేరు మండలంలోని గడ్డూరికి చెందిన ఓ మహిళ ఆమె ప్రియుడుతో కలిసి ఈ హత్య చేసినట్లు సమాచారం అధికారులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. సిఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు:
పంచలోహ విగ్రహాలు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లా(Chittoor District) పలమనేరులో కూర్మ వరదరాజ స్వామి ఆలయ భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను గుర్తించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిగాయి. గర్భాలయంలోని మూల విరాట్ క్రింది భూభాగంలో రెండు అడుగుల ఎత్తున్న విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహాలు ఏ కాలం నాటివో కనుగొనేందుకు గ్రామస్తులు ఆర్కియాలజీ అధికారుల సహకారం తీసుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీ కాళహస్తి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
మార్చి 14వ తేదీ ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు. అదే విధంగా రైతు సంఘాల పోరాటానికి, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను తిరుచానూరు బైపాస్ లోని యోగి మల్లవరం బ్రిడ్జి దగ్గర ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో కర పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోని పెద్ద ఎత్తున రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని, ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మిక మధ్య పేద తరగతి మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం. తలవంచిందని చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేనకు, బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నగర అధ్యక్షులు కేవైసీ రాజా ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బైరెడ్డిపల్లి మండలంలో వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత నాలుగో విడత సంబరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే వెంకటే గౌడ. రెండు కార్యక్రమంలో ఒకేసారి చేస్తా ఉండామని పెద్దిరెడ్డి అన్నారు. వైయస్సార్ ఆసరా వైఎస్ఆర్ చేయూత పలమనేర్ నియోజకవర్గానికి 193 కోట్ల 17 లక్షల నాలుగు విడతలు కలిసి ఇస్తే 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. యారోజన్నా ఆర్థికంగా మహిళల సంఘాల కు సభ్యులను ఇంత పెద్దగా ఎప్పుడైనా ఆదుకున్నాడా అప్పట్లో మేనిఫెస్టీల్లో ఏదేదో పెట్టి అధికారంలోకి వచ్చాడు మహిళలను మోసం చేశాడు యువకులను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు. ఆ రోజుల్లో రుణాలు మాఫీ చేసి ఉంటే 14,200 కోట్లు మాత్రమే అది చేయకపోగా ఈరోజు 25 వేల కోట్లు 570 కోట్లు అయితే కూడా ఎన్నికల ముందు మాట చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి 25 వేల 570 కోట్లు చెల్లించారా లేదని మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా చెప్తే చేయాలనే పట్టుదల ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధమైనా చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని పట్టించుకోకుండా పోవడం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచాడు. కరెంట్ చార్జ్ అయిదు సార్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు మాట నమ్మొద్దు అంటున్న జగన్మోహన్ రెడ్డి అమ్మ నీకు ఒక కేజీ బంగారు తీసిస్తానని ఇంటింటికి ఒక మోటార్ సైకిల్ తీసి ఇస్తానని, యువతకు ఉద్యోగులందరికీ ఇస్తానని రైతులకు బెంజ్ కార్ తీసిస్తానని మోసపూరితమైన మాటలు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ప్రజలారా తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు మాట నమ్మొద్దు అండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు విన్నవించారు. మీ పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ని ఎంపీ రెడ్డెప్పను గెలిపించాలని ప్రజలను ప్రార్థించారు.
మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమానికి ప్రజల నుండి విశేషణ స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరులోని యోగి మల్లవరం లో పర్యటించారు. ముందుగా పులివర్తి నానికి ప్రజల నుండి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్త లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ వైసీపీ అన్యాయాలు, నియంతృత్వ పోకడలతో పార్టీని వీడి టీడీపీ చేరుతున్నట్లు పెరుమాళ్, ఎంపిటిసి మహేశ్వరి తెలిపారు. నాపై నమ్మకంతో టీడీపీలో చేరిన పెరుమాళ్, మహేశ్వరి వారి అనుచరులకు నా కృతజ్ఞతలు చెప్పారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ, ఇంటి స్థలాలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాని, తుమ్మలగుంటలో పేద ప్రజల కోసం పోరాటం చస్తున్న నా సతీమణి పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు ఈ దాడికి పాల్పడి,- సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అలాంటి ఘటన జరగలేదని ఎంఆర్ పల్లి సిఐ చెప్పడం శోచనీయం అన్నారు. పోలీసులు, ఇతర ఏ అధికారులనైనా గౌరవించడం మా సంస్కారంని,- రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన ఎన్డీయే లో చేరడం జరిగిందిని,2014లో టీడీపీ, జనసేన, బిజెపి కలయిన చారిత్రాత్మకమైనదిని, అప్పుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బిజెపితో అవసరం ఉంటుందని,- బిజెపికి సపోర్ట్ చేస్తూ ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, బడ్జెట్, పోలవరం ప్రాజెక్టు నిధులు కోసం చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బిజెపి కూటమిని ఆదరించండిని, అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీకి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






Total views : 196768