అమరావతి, ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈసీ నుండి ఆదేశాలు.
Guntur
పల్నాడుజిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన అంగన్వాడీలు, తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లకుండా అంగన్వాడిలు గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్భంలో అంగన్వాడీ సంఘ నాయకురాలు హెల్డా మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలు రొడ్ఫున పడి సమ్మె చేస్తుంటే, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి కనపడకపోవడం దారుణం అన్నారు. కనీస వేతనం ప్రకటించే వరకు మేము ధర్నాని ఆపమని అన్నారు. మేము మా సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే, మా వెనుక టీడీపీ నేతలు ఉండి ధర్నా చేపిస్తున్నారని లేనిపోని విమర్శలు వైసీపీ నేతలు అనడం మరింత బాధ కలిగించింది అన్నారు. మేము కనీస వేతనం మాత్రమే ఆడిగాము కానీ, మేము ఏమి గొంతెమ్మ కోర్కెలు అడగలేదు అన్నారు. కనీస పరిజ్ఞానం కూడా లేని ప్రభుత్వ మంత్రులను మా వద్దకు చర్చలకు పంపిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలి చేశారు అని తెలియజేశారు.
Read Also..
బాపట్ల మండలం సూర్యలంక తీరంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సూర్యలంక బీచ్ ఉండటం బాపట్ల జిల్లాకు ఎంతో అదృష్టమని బాపట్ల ప్రజలు భావిస్తున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్‌కు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు భారీ సంఖ్యలో శని ఆదివారాలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన బాపట్లలోని లాడ్జి, రిసార్ట్స్ నిర్వాహకులు పర్యాటకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. బాపట్ల సూర్యలంకకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. త్వరలోనే బాపట్ల సూర్యలంక బీచ్ ను బ్లూ ఫాగ్ గా ప్రకటించే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాపట్ల సూర్యలంక బీచ్ పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఇక్కడకు పక్క రాష్ట్రం తెలంగాణ నుండి పండుగలకు న్యూ ఇయర్ వేడుకలకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో 2024 లో జరిగిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది పర్యాటకులు సూర్యలంకకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా లాడ్జి, రిసార్ట్స్ నిర్వాహకులు ఒకటి నుండి పది రెట్లు ఎక్కువగా అద్దెలు వసూలు చేశారని పర్యాటకులు వాపోయారు. సూర్యలంక పర్యాటక ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, మేము ఇక్కడికి వచ్చామని కానీ బాపట్లలోని లాడ్జి, రెస్టారెంట్ నిర్వాహకులు మమ్ములను నిలువు దోపిడీ చేస్తున్నారని వారు లాడ్జి నిర్వాహకులపై మండిపడ్డారు. గతి లేని పరిస్థితుల్లో వారు ఎంత అడిగితే అంతా అద్దెలు ఇచ్చి బస చేస్తున్నామని వారు వాపోయారు. బాపట్ల జిల్లా అయిన తరుణంలో బాపట్ల సూర్యలంకను ఎంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే బాపట్ల లాడ్జి నిర్వాహకులు మాత్రం అందిన కాడికి పర్యాటకుల నుండి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాపట్ల జిల్లా అధికారులు లాడ్జి నిర్వాహకులను ఇక నుండి ప్రతి లాడ్జిల, రిసార్ట్స్ ముందు బస చేసే అద్దె గదుల రేట్ల వివరాలను తెలియపరిచే విధంగా డిస్ప్లే బోర్డులు పెట్టించాలని వారు జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ముందు ఒక రేటు వచ్చిన తర్వాత పర్యాటకులు భారీ సంఖ్యలో సూర్యలంక పర్యాటక కేంద్రానికి వచ్చిన తర్వాత రూములు ఖాళీలేవని అనే సాకుతో పర్యాటకుల దగ్గర ఒకటి నుండి పది రెట్లు అద్దె ఎక్కువ వసూలు చేస్తున్నారని బాపట్లలోనీ లాడ్జి నిర్వాహకులపై ఆరోపణలు వెల్లి విరుస్తున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారని పర్యాటకులు ఆశిస్తున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్ పై అధికారులకు ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రవర్తిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్‌కు వెళ్లే దారిలో టోల్ గేటు నేపముతో నడిరోడ్డుపై టోల్ గేట్లు పెట్టి పార్కింగ్ ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్కింగ్ చేసే ప్రదేశంలో వాహనాలకు తగిన వసతులు కూడా కల్పించకుండా రోడ్డుపైనే వాహనాలు ఆపి టోల్ ఫీజు వసూలు చేసుకొని మాకు ఏమి సంబంధం లేదు అనే విధంగా టోల్గేట్ నిర్వహకులు వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఇకపోతే బాపట్ల సూర్యలంకకు సముద్రం ఒడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ రిసార్ట్స్ వెలిశాయని, ఆ రిసార్ట్స్ లో కనీస వసతులు కూడా లేకుండా ఒక్కొక్క గదికి 3000 నుండి 4000 రూపాయలు వారాంతపు సెలవు రోజుల్లో వసూలు చేస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల సూర్యలంక పర్యాటక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు చెందిన ఒకే ఒక్క హరిత రిసార్ట్స్ ఉందని అవి పెద్దలకు ధనవంతులకే అందుబాటులో ఉంటాయని పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవని పర్యాటకులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి బాపట్ల సూర్యలంక తీరంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వసతి గదులు నిర్మించాలని పర్యాటకులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇకపోతే బాపట్ల సూర్యలంక తీరంలో తినుబండారాల విషయానికొస్తే ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా పదార్థాలు తయారు చేస్తున్నారని, మరియు ఒకసారి కాచిన నూనెలో పదేపదే చేపలు, మాంసాహారాలు తయారు చేస్తున్నారని దీని మీద ఆహార నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లేదని, ఇలాంటి పదార్థాలు పర్యాటకులు స్వీకరిస్తే రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని పర్యాటకులు అంటున్నారు.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 22వ రోజు అంగన్వాడీలు రోడ్డుపై దున్నపోతు కు మెమోరాండం ఇచ్చి వినూత్న నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. దున్నపోతు మేము ఇచ్చిన మెమోరాండమ్ స్వీకరించి మాపై కృప చూపిందని, ఈ గుడ్డి ప్రభుత్వం 22 రోజులుగా అంగన్వాడీ అక్కచెల్లెళ్లు ఇల్లు వాకిళ్లు వదిలి రోడ్డుపై కూర్చొని ధర్నాలు చేస్తుంటే దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ఉందని ఇకనైనా మా డిమాండ్లు నెరవేరుస్తారని ఆశిస్తున్నామని వారు అన్నారు. లక్ష అరు వేల పై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 22 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల పట్ల దయ చూపి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
కేసానుపల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా అద్దంకి నార్కెట్‌పల్లి హైవే రహదారిని దిగ్బంధించి, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ తమ గ్రామంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వద్దంటూ, అండర్ పాస్ బ్రిడ్జి కావాలంటూ నినాదాలు చేసారు. గ్రామస్థులను ధర్నా చేయకుండా దౌర్జన్యంగా దాచేపల్లి పోలీసులు అడ్డున్నారు. రెండు గ్రామాల ప్రజలు మాకు న్యాయం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.
గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం దాతృత్వంతో అంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి సంఘీభావం తెలిపి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర సందర్భంగా వారికి మంచి రుచికరమైన బిర్యాని తానే స్వయంగా వడ్డించి అంగన్వాడి బాధలను నేను చూస్తూ ఉన్నానని, ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి మీ డిమాండ్లు నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మాడా సుబ్రమణ్యం అన్నారు.
గుంటూరు….సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇంట్లో పెళ్ళి వేడుకలు కి సన్నద్ధం అయ్యింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి కి అట్లూరి ప్రియ కి వివాహం కానుందంటూ ట్వీట్ చేసింది. ఈనెల 18న వారిద్దరి వివాహం కానుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరికీ ప్రజలు అందరూ అశ్వరదించాలని కోరింది. రేపు ఇడుపులపాయ లో వైఎస్సార్ ఘాట్ కి వెళుతున్నట్లు ట్వీట్ లో వెల్లడించింది. షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also..
న్యూ ఇయర్ వేడుకల వేళ దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గురజాల పోలీసు స్టేషన్‌కు చెందిన ఏఎస్సై స్టాలిన్‌తో పాటు మరో ఇద్దరు తెలంగాణ మద్యం తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి 36 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్ఐ స్టాలిన్ పరారీలో ఉండగా మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం అని గురజాల సెబ్ ఎస్సై జయరాం తెలిపారు.
2023 కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ గ్రూప్ ఆఫ్ సివిఆర్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గురజాల ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ రైతు,రైతు కూలి అందరు ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో సంతోషం గా ఉండాలని ఆ భగవంతుడు ని కోరుతున్నాను అని అన్నారు. అదే విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ని గురజాల ప్రాంతంలో మరియు రాష్ట్రంలో మళ్ళీ గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చెయ్యాలని వారు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు కోట కృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ మునగా పున్నారావు తో పాటు గురజాల దాచేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.