పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుక గా నిత్యవసర సరుకులను తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అందించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేడా విజయ శేఖర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అన్ని విధాలా సహాయపడే వారికి ఓటేసి గెలిపించాలని, ప్రజలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యేగా తిరిగి రావాలని, అన్నమయ్య జిల్లాను రాజంపేటకు తరలించాలని, మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు.
Kadapa
భవన నిర్మాణ సంక్షేమ సంఘానికి భారీ విరాళాన్ని, సంఘ కార్యాలయం కోసం ఏడు సెంట్ల విలువైన స్థలాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అందజేశారు. ఏపిజె అబ్దుల్ కలాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సభ్యులు కార్యలయం కోసం సాయం చేయాలని గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు దువ్వూరు రోడ్డులోని బైపాస్ వద్ద మొదట ఐదు సెంట్ల స్థలాన్ని వారికి కేటాయించి, ఆ స్థలం తాలూకు పత్రాలను నేడు భూమి పూజ అనంతరం సంఘ నిర్వాహకులకు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే భవన నిర్మాణానికి ఐదు లక్షలు, సంఘం నిర్వహణ కోసం మూలధనం కింద మరో 50 లక్షల రూపాయలు అందజేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు ఈ సందర్భంగా ప్రకటించారు. తాను రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో ఇదంతా చేయడం లేదన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. సమాజంతో చమటోడ్చి పనిచేసే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి, సమిష్టిగా పనిచేయాలన్నారు. అందుకు తన వంతు బాధ్యతగా సాయం అందిస్తానన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ, ఏ పార్టీ కూడా భవన నిర్మాణ కార్మికులను పట్టించుకున్న దాఖల్లాలేవన్నారు. తాను మంచి చేశానని విశ్వసిస్తే తనకు మద్దతు ఇవ్వాలన్నారు. తాను చేసిన కార్యక్రమాలు అందరినీ తనవైపు మరలేలా ఆ శివ పార్వతులే చేస్తారని ఎమ్మెల్యే రాచమల్లు విశ్వాసం వ్యక్తం చేశారు. మొదట ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించినప్పటికీ, కార్మికుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కార్యాలయం, ఫంక్షన్ హాలు నిర్మాణానికి అదనంగా మరో రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులకు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. భవన నిర్మాణం పనులు మొదలు పెడితే నిర్మాణ ఖర్చుల కోసం ఐదు లక్షలు, సంఘం పూర్తి స్థాయిలో ఏర్పడి సంక్షేమ కోసం పనులు ప్రారంభిస్తే అప్పుడు మూల ధనం కింద 50 లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే రాచమల్లుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఓబులవారిపల్లి మండలంలోని తల్లెం వారి పల్లి గ్రామంలో బిజెపి యువ నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త, చిన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా బిజెపి నాయకులు గ్రామంలోకి రాకతో పూలు వెద జల్లుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకుడు సత్య కుమార్, జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనతాల సురేష్, అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చంగల్ రాజు హాజరయ్యి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గుర్తింపు తీసుకు వచ్చిన పార్టీ బిజెపి అని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య రామ మందిరం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నది. కరోనా కష్టకాలంలో వివిధ దేశాలకు వ్యాక్సిన్ పంపి భారతదేశాన్ని ప్రాణదాతగా నిలిచేలా చేసింది బిజెపి అని కొనియాడారు. బిజెపి పార్టీ అంటే తెలియని గ్రామాలలో సైతం జాతీయ నాయకుల చేత గ్రామాల్లో జెండా ఆవిష్కరణ జరుగుతున్నది అంటే బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తల ఫలితమని తెలిపారు. గ్రామ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో బిజెపి పార్టీ వైపున్న తమను వైసీపీ నాయకులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.
కడప జిల్లా.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని టిడిపి నాయకులు ఎవరు ఏమీ చేయాలని అనుకోవడం లేదని, ఆయనకు ఎవరైనా హాని కలిగిస్తే, ఆయన ఫోను హ్యాక్ చేస్తే తాము ఒప్పుకోమని, ఈ విషయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఉంటామని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఫోన్ ను ఆస్ట్రేలియాలో ఉన్న కొందరు హ్యాక్ చేసి, తన పేరున నకిలీ ఖాతాతో ఫేస్బుక్ లో అశ్లీల చిత్రాలు పెడుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎవరున్నా శిక్షించాలని, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఇదే సందర్భంలో గతంలో బీసీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను బెదిరించిన కేసులో నిందితులను పట్టుకోవాలని, జిల్లా ఎస్పీనీ ఎమ్మెల్యే కోరాలన్నారు. అలాగే వైసిపికి చెందిన కొందరు వ్యక్తులను కూడా బెదిరించిన విషయంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు.
అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది.. 27 రోజులుగా ప్రొద్దుటూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరవధికంగా ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించడం లేదని వినూత్న కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు పూనుకున్నారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వం గోవిందా, జగన్ గోవిందా అంటూ నిరసించారు. ఏ రాజకీయ పార్టీ పూరి గొల్పుతే తాము ఆందోళన చేయడం లేదని, ఎన్నో సార్లు ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగామని అంగన్వాడీలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు, ప్రభుత్వం తనకు తాను ఇంటికి వెళ్లడానికి యస్మా చట్టాన్ని తమపై ప్రయోగించిందని , ఇది బస్మాసుర హస్తం లాంటిదని అంగన్వాడీలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి కోసం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందని సిఐటియు నాయకులు సత్యనారాయణ ఆచారి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు
భారత దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా 3000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదని, సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నట్లు శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కార్యకరమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోఇచ్చిన హామీలన్నింటిని వంద శాతం నెరవేర్చిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. గతంలో పెద్దాయన పరిపాలనాలో ప్రస్తుతం ఆయన ప్రతి పక్షంలో ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో 70 సంవత్సరాలు వచ్చిన వారికి పెన్షన్ అందించే వారు. కొత్త పెన్షన్ ఎవరికైనా రావాలంటే ప్రస్తుతం ఉన్న పెన్షన్ దారుడు మరణిస్తే కానీ మంజూరు అయ్యే పరిస్థితులు ఉండేవి కాదన్నది మనందరికీ తెలిసిన విషయమేమన్నారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హతే ఆదరంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు పెన్షన్ అందించారన్నారు. రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ను తన తనయుడు ఈ రోజు 3000 లు చేసిన గొప్ప మనసున్న నాయకుడమ్మ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ అన్ని రాష్ట్రాలలో కంటే ఎపిలో భిన్నమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఐదు లక్షలు నున్న వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ని 25 లక్షలకు పెంచి పేదలకు అండగా నేనున్నానని సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. అనంతరం వారు లబ్దిదారులకు పెంచిన రూ 3000 పెన్షన్ లను అందజేశారు. మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు రెండు లక్షలు రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సలర్లు, వైకాప నాయకులు,మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున వారి సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలింటర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
వైద్యం కోసం వచ్చే ప్రతి సామాన్యుడికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ఈ వంద పడకల ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుమారు 23 కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారికీ ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, అన్నమయ్య జిల్లా డి ఎం హెచ్వో కొండయ్య, ప్రాంతీయ వైద్యశాల సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, ప్రముఖ సీనియర్ వైద్యులు బయా రెడ్డి, నారాయణ రెడ్డి లతో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు, వైకాప నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుండి వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ పూర్ణ కుంభం తో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆసుపత్రి లో వివధ రకాల వైద్య సేవలందించే గదులను ప్రారంభించి వైద్యం కోసం వచ్చే రోగులకు సంబంధించిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ దినం చాల చారిత్రాత్మక దినం అన్నారు. వందపడకల ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి రావడంతో రాయచోటి ప్రజల చిరకాల కోరిక నేటితో నేరవేరిందన్నారు. ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి మొట్ట మొదటి సారిగా రాయచోటిలో పర్యటించినప్పుడు వందపడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు శంకు స్థాపన చేశారన్నారు. అయితే కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందన్న శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ ల సహకారంతో త్వరిత గతిన నిర్మాణాలను పూర్తీ చేసుకొని ఈ రోజు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే సిటి స్కాన్, 8 బెడ్లు ఉన్న డయాలసిస్ ను 20 బెడ్లకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతున్న పేద, బడుగు, బలహీన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపయోగపడేలా సామాజిక మాద్యమాల ద్వారా ఉచిత మెంటల్ ఎబిలిటీ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ప్రతి రోజు కొత్త తరహా ప్రశ్నలతో విద్యార్థి అరచేతిలో గ్రూప్స్ మెటీరియల్ ని అందుబాటులో ఉంచుతామన్నారు. నేటి నుండి పరీక్షలు పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు యాభై సమాధానాలతో కూడిన ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ప్రచురితం అవుతుందన్నారు. ఈ ప్రశ్న ప్రతాన్ని అపార అనుభవం కలిగిన నిష్ణాతులైన వారిచె తయారు చేయడం జరుగుతుందన్నారు. మెటీరియల్ కొనలేని పేద విద్యార్థులకు ఇది కొంత వరకు ఉపయోగపడెలా నా వంతు ఓ ప్రయత్నం చేస్తున్నానన్నారు. రాబోవు రోజుల్లో నిరుద్యోగ యువతీ యువకులతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేలా ఇలాంటి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు ఎల్లవేళలా అండగా నిలుస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారు ఆకాక్షించారు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులకు రూ 3 వేలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని, ఈ ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పండుగ వాతావరణంలో జరిగిన రైల్వే కోడూరు మండల పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారన్నారు. రైల్వే కోడూరు మండలంలోనే సుమారు 11 వేలుకు పైగా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు. నెలకు పెన్షన్ల క్రింద రైల్వే కోడూరు మండల పరిధిలో రూ.10 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు. జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో చట్టబద్దత లేని జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో, దుష్టచతుష్టయం తో పావులు కదుపుతున్నారన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ తో పాటు స్వీట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్లు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, మందల నాగేంద్ర, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు.






Total views : 198630