కడప జిల్లా… జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన 50 చేనేత కుటుంబాలు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా.. కదలిరా నినాదాన్ని విశ్వసించి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయడం జరిగిందని అన్నారు. వైకాపా ప్రభుత్వం పేద ప్రజలపై ధరల భారాన్ని మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకతను మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Kadapa
కడప జిల్లా.. జమ్మలమడుగులోని రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామం, రాజీవ్ కాలనీకి చెందిన మహబూబ్ బాషా(50) గా పోలీసులు నిర్ధారించారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా.. ఇద్దరు కుమారులు మేనమామ వద్ద ఉన్నారు. ఆస్తికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు దారితీసిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్.. క్లూస్టిం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆయనపై కరుడుగట్టిన అభిమానుల్లో కూడా వ్యతిరేకత మొదలైంది. కడప నగరంలో వైసిపీ కి జనం మాత్రమే కాదు… సొంత బ్యాచ్ వ్యతిరేకంగా మారుతున్నారు. ఒకరిద్దరు కాదు 22 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడే యోవచనలో ఉన్నారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఓ ముఖ్య నేత తమకు కనీసపాటి విలువ ఇవ్వకపోవడం… ప్రభుత్వ తీరుతో జనంలో తమ పట్ల వ్యతిరేకత పెరగడంతో కార్పొరేటర్లు ఆందోళన చెందుతున్నారు. వీరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతుండటంతో కడప రాజకీయాలు కాకరేపుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జమానా నుంచి వారి కుటుంబాన్ని కడప అక్కున చేర్చుకుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో కడపపై తన మార్పు చూపించుకున్నారు. మున్సిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్ గా మార్చారు. 2005 తర్వాత వరుసగా అప్పట్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీనే కడప మేయర్ పదవి చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కార్పొరేటర్లు అంతా కాంగ్రెస్ కు బై చెప్పి వైసీపీ గూటికి చేరారు. 2014-19 ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారు. కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా…వీరిలో ఒకరు టిడిపి..మరొకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుస్తుంది అనే పాజిటివ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. ఈసారి టిడిపి వస్తుందనే నమ్మకం వైసీపీ వీరాభిమానుల్లోను బలబడింది. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్న కార్పొరేటర్లు ఒక అంచనాకు వచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అనే నిర్ణయానికి వచ్చారు. దీంతో కొందరు వైసీపీ కార్పొరేటర్లు టిడిపి నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
దివంగత వైయస్ రాజారెడ్డి సతీమణి వైయస్ జయమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ పులివెందులలోని వైఎస్ జయమ్మ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జయమ్మ 18 వ వర్ధంతి సందర్భంగా ఆమె పులివెందులకు చేరుకొని పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వైఎస్ జయమ్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆమె వెంట మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి వైయస్ సౌభాగ్యమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి, వై ఎస్ వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పాల్గొన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో అవగాహన ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన సందర్బంగా ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఎన్నికలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అవగాహన ర్యాలీ కోటి రెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్ మీదుగా కొనసాగింది. అనంతరం మహావీర్ సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్, మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, ఆర్డీవో మధుసూధన్, కడప తహశీల్దార్ శివ రామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలికల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి డైట్ స్కూల్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండయ్య అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలి డైట్ స్కూల్ నుంచి నేతాజీ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికా సంరక్షణతో పాటు సాధికారిత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. బ్రూణ హత్యల నిరోధాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వ్యతిరేకించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాలబాలికల మధ్య తేడాలు చూపవద్దన్నారు. చిన్నతనం నుంచే బాలికలకు అవకాశాలు కల్పించినపుడే సమాజంలో మార్పు సాధ్యం అవుతుందన్నారు. ఆడపిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య అధికారులు, వైద్యులు, సిబ్బంది, ఇసిడీఎస్ ఇంచార్జి పిడి శశికళ తో పాటు డైట్ ఇంచార్జి ప్రిన్సిపాల్ శివ బాస్కర్, డైట్ విద్యార్థినిలు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా, కుప్పం మండల పరిధిలోని బంగారునత్తం చెరువులో శనివారం యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సంజయ్ తల్లిదండ్రులు రవి, మంజుల మీడియాతో మాట్లాడుతూ, తమ బిడ్డ సంజయ్ ను శనివారం ఉదయం 10 గంటలకు సమయంలో రవీందర్ అనే యువకుడు ఇంటి నుండి కారులో తీసుకెళ్ళాడని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఫోన్ లో చివరిగా మాట్లాడామని తెలిపారు. కాగా పక్కా ప్లాన్ తోనే సంజయ్ ను రివిందర్, బాలాజి, రోహిత్ లు చెంపేసి ఉంటారని సంజయ్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసమే తమ కుమారుడిని హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. తమ కుమారుడు ఆచుకిని కనుగొని తమకు న్యాయం చేయాలని సంజయ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు, బట్టలు కొనడానికి వస్తే పోలీసులు తనిఖీలు చేసి అధారాల్లేవని డబ్బులు సీజ్ చేయడం వెనుక ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నాడని, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలు కాకముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు పట్టుకుని ఐటికీ అప్పజెప్పడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ దాడులు చేయించేది, ఆపై సానుభూతి ప్రకటించి, ధర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు. పోలీసుల దాడుల వ్యవహారంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని టిడిపి తో కలసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాలని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు. 30 మద్యం బాటిళ్లు పట్టుకుంటే ఎక్సైజ్ స్టేషన్ కు వెళ్ళి ఎస్ఐని నిలదీసిన ఎమ్మెల్యే 14 లక్షల నగదు కూతురు పెళ్ళి నగల కోసం తీసుకురాగా పట్టుకున్నప్పుడు ఎందుకు పోలీస్టేషన్‌కు వెళ్లలేదన్నారు. తాను నియమించుకున్న ఇబ్రహీం ఎమ్మెల్యేకి తెలియకుండా ఏదీ చేయడని విమర్శించారు.
వైసిపి ప్రభుత్వంలో ఆరాచక పాలన కొనసాగుతోంది, ప్రొద్దుటూరులో వ్యాపారస్తుల దగ్గరకు వచ్చిన వినియోగదారుల డబ్బులను రైడ్ చేసి పట్టుకునే విషయం స్థానిక ఎమ్మెల్యేతోపాటు, సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా తెలుసునని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. లోకల్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని, కూతురు పెళ్ళి కోసం బంగారం కొనేందుకు వచ్చిన వారి నుంచి డబ్బులు పట్టుకుని ఐటి అధికారులకు అప్పజెప్పడం దారుణమన్నారు. ఓ సామాన్య వ్యక్తి తన కూతురు పెళ్ళి ఎలా చేస్తాడని మాజీ ఎమ్మెల్యే వరద భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో వ్యాపారులను, రిజిస్టర్ ఆఫీసుకు వచ్చే ప్రజలను, బంగారు కొనుగోలుకు వచ్చే వారిని పట్టుకుని పోలీసులు వేధించడం దారుణమన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకవైపు చేస్తూ… ఆ ఎమ్మెల్యేనే వారిపట్ల సానుభూతి తెలపడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే వరద ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నేరుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే ధర్నా చేయడం ఏమిటన్నారు. తనకు కావాల్సిన ఎస్ఐలను, సిఐలను, పోలీసు అధికారులను నియమించుకునే ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో ఎందుకు మాట్లాడరని నిలదీశారు.
కడప జిల్లాలో వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరులో వ్యాపారులను, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో పోలీసులు తనిఖీలు చేస్తూ ఎలాంటి రసీదులు, ఆధారాలు లేవంటూ పెద్ద ఎత్తున నగదు సీజ్ చేయడం పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాపారులకు మద్దతుగా పట్టణంలోని బంగారు అంగళ్ల సర్కిల్ లో వ్యాపారులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా, కోడ్ అమలులోకి రాక ముందే సామాన్యులు తమ అవసరాల కోసం బంగారు, బట్టలు కొనుగోలు కోసం తెచ్చుకున్న సొమ్మును రసీదులు, తగిన ఆధారాలు లేవని సీజ్ చేయడం సరైంది కాదన్నారు. తాను చేస్తున్న అభ్యంతరాలను వ్యాపారులకు సామాన్య ప్రజలకు జరుగుతున్న నష్టానికి నిరసన అని భావిస్తారో, రక్షణ అని భావిస్తారోగానీ ఇది ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకం కాదని, ప్రజలు పడుతున్న ఇబ్బందిని తెలియజెప్పే ప్రయత్నమే అన్నారు. ప్రజల ఇబ్బందులను సిఎం దృష్టికి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడి వ్యాపారాలు జరగక పోతే, అన్ని వ్యాపార సంఘాల వారు బంద్ చేసే పరిస్థితి వస్తుందన్నారు. అదే జరిగితే ప్రొద్దుటూరు వ్యాపారుల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో నష్టం కలుగుతుందని చెప్పారు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోసం ఎవరైనా డబ్బులు తీసుకెళ్లే రాజకీయ నేతలను పట్టుకుంటే అర్ధముందని, ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు కూడా ప్రజలకు, వ్యాపారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




Total views : 198255