అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం పట్టణ శివారులో ఉన్న సంసిద్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విజయ శంకర్ అనే వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు. విద్యార్థుల మర్మాంగాలపై దాడి చేసి గాయపరిచాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు వార్డెన్ గదిని తనిఖీ చేయగా.. గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు, పొగాకు ఉత్పత్తులు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు బయట పడ్డాయి. వెంటనే చర్యలు తీసుకుంటామని డీఈవో మాట మార్చారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Karnool
అనంతపురం జిల్లాలో రా.. కదలిరా.. కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై అలాగే అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. మాజీ మంత్రి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబు వ్యవహార శైలి పై ధ్వజమెత్తారు. ఆయన తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటున్నారు.
అంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్.డి.టి ఆసుపత్రిలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆర్డిటి వైద్యులు ఆమె ముగ్గురు ఆడపిల్లలను ప్రసవించిందని తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులు తెలిపారు. ఇప్పటికే లక్ష్మీదేవి గణేష్ లకు మొదటి కోవిడ్ సమయంలో వివాహం జరిగింది. మొదటి కాన్పులో నాలుగేళ్ల క్రితం నార్మల్ డెలివరీలో పాప జన్మించింది. రెండో కాన్పులో సిజేరియన్ ద్వారా ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ఒకటో సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేయాల్సిన సచివాలయ సిబ్బంది కనీసం వేడుకలు కూడా నిర్వహించలేదు. పది రోజుల కిందట సచివాలయ ఆవరణలో వైసీపీ జెండాను ఎగరవేసి అలాగే ఉంచేశారు. నేడు దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే సచివాలయ సిబ్బంది మాత్రం ఫీల్డ్ పనిమీద బయటకెళ్లే అంశాన్ని సాకుగా చూపి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు. దీంతో సచివాలయం వద్దకు వచ్చిన స్థానికులు వైసీపీ జెండా ఎగురుతుండడం చూసి సచివాలయ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో తెలుగుపేట కొత్తపల్లికి చెందిన కబాడీ జట్ల ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఇరుజట్ల ఆటగాళ్లు మూకుమ్మడిగా పిడి గుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘర్షణలో తెలుగుపేటకు చెందిన ఆటగాళ్లకు గాయాలుగా వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న రెఫరీలు, స్థానిక పోలీసులు కలుగజేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది.
అనంతపురం జిల్లా గుత్తి మండలం తాహసిల్దార్ కార్యాలయం వద్ద గుత్తి మండల యూనిట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్లు తమ అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు ప్రధానమైన డిమాండ్లతో నేడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ప్రెసిడెంట్ అబూబాకర్ మాట్లాడుతూ 11వ పిఆర్సి లో తగ్గించిన అదనపు పెన్షన్‌ను తిరిగి యధావిధిగా అంతకుముందు ఇస్తున్నట్లు 70 సంవత్సరాలు నిండిన వారికి 10% 75 సంవత్సరాలు నిండిన వారికి 15% కు పునరుద్ధరించాలని, పెండింగులో ఉన్న డి.ఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 11వ పిఆర్సి అరియర్స్ ను వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన ఆస్పత్రులందు వైద్యం అందించాలని, మెడికల్ రీయంబర్స్మెంట్ పరిధిని రెండు లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాహసిల్దార్ గారికి సమర్పించారు.
Read Also..
రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నమ్మకమైన భవిష్యత్తును ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అనంతపురం జిల్లా కు రానున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉరవకొండ పట్టణం లో నియోజక వర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్రం లో రాయలసీమ జిల్లాలు చాలా ఇబ్బందులు పడుతున్నా మాట్లాడే నాయకులే లేరన్నారు. హంద్రీ నీవా వాటా ను 5 టీఎంసీల నుంచి 50 టీఎంసీల వరకు పెంచినా వర్షాలు రాకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అనంతపురం జిల్లా పూర్తీ స్థాయి లో అన్యాయానికి గురవుతున్నది అన్నారు. ఇదే విషయాన్ని పిసీసీ ప్రెసిడెంట్ షర్మిల జిల్లా పర్యటనలో ప్రధాన అజెండాగా చేరుస్తామని అన్నారు.
Read Also..
రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే కేటాయించాలని ఎస్వీ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి సిఎంవో నుంచి పిలుపు రావడంతో అమరావతి వెళ్ళారు. అయితే ఈ సారి మళ్ళీ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ హఫీజ్ ఖాన్‌కే ఇస్తారనే ప్రచారం జరుగుతుండటంతో కర్నూలు నగర శివార్లలో ఓ ప్రైవేట్ హోటల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు సమావేశమయ్యారు. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తిరిగి హఫీజ్ ఖాన్‌కే కేటాయిస్తే సహకరించేది లేదని ఎస్వీ వర్గీయులు స్పష్టం చేశారు. ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత 5సంవత్సరాల్లో స్వంత పార్టీలోనే అనేక ఇబ్బందులు పడి కేసులను ఎదుర్కొన్నామని.. ఇపుడు మరో సారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ సారి కచ్చితంగా కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే ఇవ్వాలని ఎస్వీ వర్గీయులు పట్టుబడుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య కొద్ది కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇపుడు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే కేటాయించాలని ఎస్వీ వర్గీయులు డిమాండ్ చేస్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్నూలు జిల్లా, పత్తికొండ లో శ్రీ శక్తి భవనం దగ్గర చిరుత పులి హల్ చల్. తిరగబడ్డ కుక్క, కుక్కకి , గొర్రెలకు గాయాలు. గొర్రెల కాపరి సమాచారం మేరకు గొర్రెల మంద పై చిరుత దాడి సమయంలో కుక్క అడ్డగించిందని, కొన్ని గొర్రెలకు కూడా గాయాలయ్యాయి అని కాపరి ప్రతాప్ తెలిపాడు. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పక్కనే ఉన్న పొలాల రైతులు వ్యవసాయం చేసుకోవడానికి బిక్కుబిక్కు మంటూ పనులు చేసుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి ప్రవేశించారు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ సమస్యల పరిష్కరించాలని వినూత్న రీతిలో మట్టిని తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మొద్దు నిద్రలో ఉందన్నారు, ఇప్పటికైనా మా సమస్యల పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు. లేకపోతే రోజు కూడా ఇలానే మట్టిని తింటూ మేము మా సమస్యల పరిష్కరించేంత వరకు కూడా పోరాడుతామని అన్నారు. పెనుకొండకు వచ్చిన శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పట్టించుకోకుండా ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు.





Total views : 196554