శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు మద్యాహ్నం కార్తీక పౌర్ణమి ఘడియలు రావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం నిర్వహించారు ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థంబాలపై నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచి శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో పెద్దిరాజు,ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్.కె.రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జ్వాలాతోరణాలను దివిటీ లతో వెలిగించగా భక్తులు ఓం నమః శివాయ హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ శివ నామస్మరణలతో క్షేత్రం మారుమ్రోగింది భారీగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునుతులైయ్యారు ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క కృష్ణవేణి నదిమాతల్లికి వివిధరకాల హరతులిచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటీపడగ అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Kurnool
శ్రీశైలంలోని మణికేశ్వరిమాత ఆలయానికి వెళ్లే దారిలోని క్షేత్ర రింగ్ రోడ్డులో భక్తులకు చెందిన మినీ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది తప్పిన పెను ప్రమాదం విజయవాడకు చెందిన టూరిస్ట్ బస్సు భక్తులతో శ్రీశైల మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చి భక్తులను దర్శనానికి వదిలివేసి టోల్గేట్ దగ్గర నుండి ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చి అదుపు చేయలేక బోల్తా వేసినట్టుగా సమాచారం అదృష్టవశాత్తు బస్సులో భక్తులు ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బస్సు బోల్తా పడిన సమయంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది బస్సు ప్రమాదం తెలుసుకున్న శ్రీశైలం సీఐ దివాకర్ రెడ్డి,ఎస్ఐ లక్ష్మణరావు,దేవస్థానం అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బోల్తా పడిన బస్సును పరిశీలించి డ్రైవర్ కి వైద్యం కోసం దేవస్థానం ఆసుపత్రికి తరలించి బస్సు బోల్తా పడిన ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లుతో చర్చిoచగా వైసీపీ ప్రభుత్వం లో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో ఆటో డ్రైవర్ల నుండి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారని ,అధిక డీజిల్ ధరలతో ,రోడ్లు సరిగా లేక ఆటోలు రిపైర్లు రావడంతో కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందని వాపోయారు, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల జీవితాలు మార్చేస్తానన్న జగన్ ఇప్పుడు వాళ్ల పాలిట యముడి లా తయారు అయ్యారని డ్రైవర్లు వాపోయారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అసలే అంతంత మాత్రం బతుకులు, నిబంధనల పేరుతో అడుగడుగునా పోలీసుల వేధింపులు,ఆపై జరిమానాలు. పెట్రోలు, డీజిల్ ధర మంటలు నెల తిరిగే సరికి అప్పుల వారి ఒత్తిళ్లు ఇవీ ఆటో, క్యాబ్, ట్రక్కు డ్రైవర్ల కష్టాలు. వారి సంక్షేమాన్ని పట్టించుకునే స్థితిలో ఈ వైసిపి ప్రభుత్వం లేదన్నారు. గ్రామీణ ప్రాతాల్లో కనీసం ఓ కిలోమీటరైనా సరిగా లేని రొడ్లు.! ఆపై పొరపాటున ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్లపై తీవ్ర భారంతో వారి కుటుంసభ్యులు కోలుకునేందుకు ఏళ్ల వ్యవధి పడుతోందనీ దీనికి తోడు కేసులతో పాటు జరిమానాలు చెల్లించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి వస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డ సవితమ్మ. ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, నల్లూరు మాజీ సర్పంచ్ గోపాల్, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి, సనాఉల్లా బాలాజీ నాయక్, మారుతి ప్రసాద్, వాసుదేవరెడ్డి రాంపురం అంజి, మంజు, గోవిందప్ప, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గన్నారు.
నంద్యాల నూనెపల్లి రైల్వే ట్రాక్ పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు బాల నరసింహులు ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని మృతుడి తల్లి ఆరోపిస్తుంది. కొడుకు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ గూడూరులో మీడియా సమావేశం. రెండు తెలుగు రాస్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయి. బి ఆర్ ఎస్ చేస్తున్నాదంతా అక్రమాలే అన్యాయలే ఆంధ్రపరదేశ్ లో వైసీపీ కి బీజేపీ కి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం. బీజేపీ కి వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి ఉండడకూడదనేది మోడీ తత్వం బీజేపీ ని వ్యతిరేకించిన వారిపై సిబిఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు. కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ తెరాస బీజేపీ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ బీజేపీ తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ తెరాస బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం హమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారు. మోడీ అమిత్ షా అండతోనే జగన్ ఇన్ని కేసులు ఉన్న బయట తిగితున్నాడు. విభజన చట్టాల్లోని హామీలు అమలు చేయకుండా చేస్తుండేది. బీజేపీ ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేదే బీజేపీ సిద్ధాంతం. టి ఆర్ ఎస్ ఇపుడు బి ఆర్ ఎస్ గా ఉంది ఎన్నికల తరువాత వి ఆర్ ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ )గా అవుతుంది. దేశంలో ఇండియా కూటమి రోజురోజుకి బలపడుతోంది. బీజేపీ ఓడిపోతుందనే బయముతోనే దుర్మార్గలాక్కు పాల్పడుతుంది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న ఎవరైనా హత్యలు మానభంగాలు చేయవచ్చు అటువంటి వారి జొలికి ఏ అధికారి కూడా వెళ్ళరు.
Read Also..
Read Also..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుర్క జైపాల్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీను నాయక్ కు దాఖలు చేశారు. అంతకుముందు కర్మన్ ఘట్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కల్వకుర్తిలోని అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు నన్ను ఆశీర్వదించి కల్వకుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ మరియు బి ఫామ్ అందజేయడం జరిగిందని. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నన్ను గెలిపిస్తాయని కుల మతాలకు అతీతంగా కారు గుర్తు మీద ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో కరువు ప్రాంతం పర్యటనకు వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు,జ్యోతి నెహ్రూ,మా రెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కూన రవికుమార్, డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్. పలు పొలాలలో కరువుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షములు సమయానికి పడలేదు రైతు చాలా ఇబ్బందుల పాలవుతున్నాడని రైతులు వాళ్లతో వారి బాధల గురించి చెప్పుకున్నారు.
కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న, ఏడు మంది బుక్కిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 లక్షల 15 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిలో కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. మీడియా సమావేశం నిర్వహించిన టూటౌన్ సిఐ తబ్రేజ్, ఎస్సై జయ రాములు, ఎస్సై సంజీవరాయుడు.





Total views : 81798