రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని వైకాపా నాయకులు అన్ని రకాలుగా దోచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 15 వ వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంను నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మోసపూరిత పథకాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు ముందు చూపు లేకపోవడంతో విద్యుత్తు సమస్య నెలకొందన్నారు. తెదేపా అధికారంలోనికి వస్తే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు.
Kurnool
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి. సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది వరుస సెలువులు అందులోను కార్తీకమాసం చివరి రోజులు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భారీగా తరలి వస్తున్నారు. భక్తులరద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి స్పర్శ దర్శనం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు అందరికి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైలం ఆలయ ప్రాకారం చుట్టూ వున్న శిల్పాలను డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసి స్థల పురాణ గ్రంధాన్ని నిపుణులతో తయారు చేయిస్తామని అలానే చిత్రలేఖనం తయారు చెపిస్తామన్నారు. అలానే ఈనెల గాని వచ్చేనెల గాని సాలు మండపాలు, క్యూకాంప్లెక్స్ పలు అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదగా శంకుస్థాపన చేయించాలని నిర్ణయించామన్నారు. ఆలయ వెనుక భాగంలో ఉన్న ఏనుగుల చెరువును సుందరీకరణ చేస్తామన్నారు. అలానే రాష్ట్రంలోని గత సంవత్సరం ఆగస్టు నుండి A6 ఆలయాలలో వారోత్సవాలు చేస్తాం. ప్రధాన ఆలయాలలో ఇప్పటికే మహోత్సవాలు చేస్తున్నామన్నారు. హిందూ ధర్మాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందూ ధర్మం ఒక మతానికి సంబంధించినది కాదని చెప్పరు శ్రీశైలంలోని పంచమటాలను అభివృద్ధి చేసి ఉచితంగా బ్యాటరీ కారులో పంచమటాలను భక్తులు దర్శించేలా ఏర్పాటు చేస్తామని రెడ్డి రాజుల కాలంలో నిర్మించిన పురాతన మెట్లను కూడా పునరుద్ధరణ చేయాలని తీర్మానించామన్నారు. శ్రీశైలంలో మహాకుంభాభిషేకం పీఠాధిపతుల నిర్ణయం ప్రకారం ఉత్తరాయణంలోనే నిర్వహిస్తామన్నారు. చిన్నపిల్లలకు భగవంతుని ముద్రపడేలా కార్టూన్స్ ఏర్పాటు చేయాలని చెప్పాం ఆలయాలలో ఇంజనీరింగ్ క్యాడర్ పెంచడం కోసం చర్యలు తీసుకుని త్వరలోనే క్యాడర్ ని పెంచుతామని మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు తెలిపారు….
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు గత మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు. రెండు రోజులుగా అద్దె డబ్బులు కట్టకపోవడంతో తెల్లవారుజామున అద్దె కోసం రూమ్ బాయ్ తలుపులు తెరిచి చూడగా వ్యక్తి మృతి చెంది వికటజీవిగా పడి వున్నాడు. దీనితో లాడ్జ్ వాళ్ళు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన రాజశేఖర్ రావు, వయసు 44 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడు గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలి శ్రీశైలంలో పలు హోటల్లో పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కరికి రూమ్ ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చిన అందుకు స్థానిక పోలీసుల పర్మిషన్ కావాలని తెలిసిన కూడా రూల్స్ కి వెతిరేకంగా రూమ్ ఇవ్వడంపై పలు అనుమానాలు తవిస్తున్నాయి. అనుమానస్పద మృతి ఘటనపై కేసు నమోదు చేసిన సుండిపెంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆలయ పూజారిని దూషించి ఘర్షనకు దిగాడని పూజారి రజనీకాంత్ ఈఓ పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ ఉద్వోగి శివారెడ్డి దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన సమయంలో పూజారికి రజినికాంత్ కు ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డి మద్య ఘర్షన జరిగింది. పూజారి రజనీకాంత్ ను భూతులు తిడుతూ చేయి చేసుకున్న ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డిని ఈఓ పెద్దిరాజు విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పూజారిపై ఘర్షణకు దిగిని ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డిపై చర్యలు తీసుకున్నామని, అతనిని విధులు నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఆలయ ఈఓ పెద్దిరాజు స్పష్టం చేశారు. పూజారి రజనీకాంత్ వసతి విభాగం ప్రోటోకాల్ ఉద్యోగి శివారెడ్డిపై జరిగిన ఘర్షణలపై విచారణ చేస్తున్నామని ఈఓ పెద్దిరాజు తెలియజేశారు. పూజారిపై దాడిని బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also..
మహానంది పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతంలో గత కొంతకాలంగా ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఉదయం గాజులపల్లె టోల్గేట్ సమీపంలోని అరటి తోటలో సంచరిస్తున్న ఎలుగుబంటి చూసి అక్కడి స్థానికులు ఎలుగుబంటిని గమనించి కేకలు, ఈలలు వేయడంతో సమీపంలోని అడివి ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గత కొంత కాలంగా మహానందిలో ఎలుగుబంటి సంచారం చేస్తుందని, ఎవరికి ఏ ప్రాణ హాని జరగక ముందే అటవీ శాఖ అధికారులు స్పందించాలన్నారు. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు, భక్తులు భయాందోళనలకు గురి అవుతున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎలుగుబంటిని బంధించి, తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం విద్యార్థులను తీవ్రంగా కొట్టింది, అనంతరం విద్యార్థులకు గుండు కొట్టించింది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు, అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్‌కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు, అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందచేస్తున్నారు. శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేశారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి ఆర్.కె.రోజాకు ఆలయ అర్చకులు,ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవం దశ హారతులలో మంత్రి ఆర్. కె.రోజా పాల్గొన్నారు.
Read Also…
Read Also…




Total views : 196425