కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి. తనను, తన కుటుంబాన్ని సాదిక్ తీవ్రంగా వేధించాడని.. ఎదిరించిన ప్రతీసారి దాడి చేసేవాడని సౌజన్య ఆరోపించినట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని.. మతం మారాలంటూ చిత్రహింసలు పెట్టాడని ఆమె లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సాదిక్ వేధింపులు భరించలేకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చివరి లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసిన ఘటనలో.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఓ చివరి లేఖ తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఐదు పేజీల ఆ లేఖలో సౌజన్య చేసిన ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. తనను, తన కుటుంబాన్ని షేక్ సాదిక్ తీవ్రంగా వేధించాడని సౌజన్య ఆరోపించినట్లు సమాచారం. తనను ఎదిరించిన ప్రతిసారీ దారుణంగా కొట్టేవాడని.. ప్రతిరోజూ నరకం అనుభవించానని ఆమె లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని ఆరోపించింది.
అంతేకాదు.. మతం మారాలంటూ తనపై ఒత్తిడి తెచ్చి చిత్రహింసలకు గురిచేశాడని సౌజన్య పేర్కొన్నట్లు సమాచారం. సాదిక్ ఆగడాల గురించి అతడి కుటుంబ సభ్యులకు కూడా తెలుసని.. అతడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాననే కోపంతో తనపై దాడి చేశాడని లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇక్కడితో ఆగని ఆరోపణలు.. ఓసారి తనను సముద్రంలోకి తోసేశాడని సౌజన్య సంచలన ఆరోపణ చేసినట్లు సమాచారం. తన భర్త నూకరాజుకు కూడా సాదిక్ వేధింపుల గురించి చెప్పానని.. జగదీశ్‌రెడ్డిని సైతం సాదిక్ తీవ్రంగా కొట్టాడని ఆమె లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తన భర్తకు ప్రమాదకరమైన కెమికల్స్ ఇచ్చి చంపేశాడని కూడా సౌజన్య ఆరోపించినట్లు సమాచారం. అయితే లేఖలోని ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. మరోవైపు నిందితుడు షేక్ సాదిక్‌ను పోలీసులు కాకినాడకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు సాదిక్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసుల విచారణలో సాదిక్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఈ నూకరాజు కుటుంబం మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని సాదిక్ చెబుతున్నట్లు సమాచారం. దీంతో సౌజన్య చివరి లేఖలో చేసిన ఆరోపణలు, పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తున్న అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఒక కుటుంబం బలైపోయింది.. ఓ తల్లి చివరి మాటలు మాత్రం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను మిగిల్చాయి. ఆ ఐదు పేజీల లేఖలోని ప్రతి ఆరోపణ వెనుక ఉన్న నిజమేంటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.