పశ్చిమగోదావరి జిల్లా తీరప్రాంత గ్రామాల్లో కోట్లాది రూపాయలతో నిర్మించిన, రహదారులను ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. మొగల్తూరు మండలంలోని పాతపాడు, పేరుపాలెం, కెపిపాలెం గ్రామాల్లో పలు రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పాతపాడు గ్రామంలో రూ 27.6 లక్షలతో చేపట్టిన మంచినీటి సరఫరా పనులకు, పేరుపాలెంలో రూ 28 కోట్లుతో నిర్మిస్తున్న ముత్యాలపల్లి – మోళ్ళపర్రు సీసీ రోడుకు, ‘పేరుపాలెం బీచ్ లో రూ 4.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం, అదే గ్రామంలో మెట్రేవు నుండి మోళ్ళపర్రు వరుకు రూ 8 కోట్లతో నిర్మించే సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కెపిపాలెం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్రా దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెపిపాలెం, పేరుపాలెం బీచ్‌లను అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మాణం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. 2020లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించి కెపిపాలెం, పేరుపాలెం బీచ్‌లకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరున నామకరణం చేసిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గ్రేడ్ వన్ బీచ్ గా వైజాగ్ లోని భీమిలి బీచ్ ప్రసిద్ధి చెందితే గ్రేడ్ టూ గా పేరుపాలెం బీచ్ పేరు దక్కించుకుందన్నారు. దీంతో బీచ్ మరింత బివృద్దికి సులభం అవుతుందన్నారు. మోళ్ళపర్రు నుండి కెపిపాలెం బీచ్‌లకు డబుల్ రోడ్డులు ఇప్పటికే ఒక లైన్ రోడ్డు పూర్తయిందని మరో లైన్ రోడ్డు నిర్మాణ దశలో వుందని అన్నారు.
West Godavari
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శివనామస్మరణతో మారు మోగిన పంచారామ క్షేత్రం ఓం నమశ్శివాయ హర హర మహాదేవ అంటూ ఎంతో కన్నుల పండుగ శోభాయమానంగా స్వామివారి రథోత్సవం సాగింది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడి లోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాల భాగంగా ఈ రోజు స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు యువ నాయకుడు గ్రంధి రవితేజ భీమవరంలో శోభాయమానంగా సాగుతున్న పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి రథోత్సవం పుష్పాలతో, అరటి గెలలతో అలంకరించిన భారీ రథంతో ఉత్సవం నిర్వహిస్తున్న భక్తులు మేళ తాళాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బాణాసంచా కాల్పులతో జరుగుతున్న రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న భీమవరం వన్ టౌన్ పోలీసులు స్వామి వారి ఆలయము నుండి నాచువారి సెంటర్ వరకు కోలాహలంగా శివ నామస్మరణతో మహిళా భక్తుల హారతులతో ముందుకు సాగింది.
పంచారామ క్షేత్రాల(Pancharama kshetras):
పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమారామం ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari) భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం(Sri Someshwara Janardhana Swamy Temple)లో మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణ మంతా మారుమోగుతుంది అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారికి జగత్ జ్యోతి, అఖండ జ్యోతి, ఏకాదశ మహా రుద్రాభిషేకం, దివ్య అలంకారం, మహానివేదన, గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణం ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బీరంగూడ దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి పంచారామక్షేత్రాల లో ఒక్కటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. రామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలతో పాటు చిన్న పిల్లలకు పాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వామి వారికి ప్రత్యేక పూజలతో రుద్రాభిషేకం, స్వామివార్ల గ్రామోత్సవము, శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి పాంచాహ్నిక దీక్షా కళ్యాణ మహోత్సవము, రధోత్సవము, తెప్పోత్సవము జరుగుతాయన్నారు. భక్తులంతా పాల్గొని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆశీస్సులు పొందాలన్నారు.
టీడీపీ జనసేన కూటమికి ప్రజలు మద్దతు తెలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రజలకు వివరించారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని ఏటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా ఇరు పార్టీ నాయకులు కూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: పాదయాత్రతో శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కాళీపట్నం భూములు దీర్ఘకాలిక సమస్యను పరిష్కారించామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర లో కాళీపట్నం భూములకు పట్టాలును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అరవై ఏళ్లుగా పరిష్కారం చేసి అనుభవంలో ఉన్న రైతులకు పూర్తీ హక్కులను కల్పిస్తున్నామన్నారు. కాళీపట్నం రెవెన్యూ పరిధిలో 7 వేలు మంది అనుభవం లో ఉన్నారు. ప్రస్తుతం పదిమంది కి పట్టాలు అందజేసాం. పట్టాలు పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఎటువంటి సాంకేతిక ఇబ్బందుల తలెత్తకుండా రైతులు అన్నివిధాల ఉపయోగపడే విధంగా హక్కులు కల్పించి పట్టాలు అందజేస్తున్నామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అమలు లోకి మరో గ్యారెంటీ పథకం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తాడేపల్లిగూడెం జెండా సభతో రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. పవన్ కళ్యాణ్ సభాముఖంగా చేసిన వ్యాఖ్యలు కాకారేపాయి. ప్రధానంగా జనసైనికులతోపాటు, కాపు వర్గీయుల్లో కొందరిని పవన్ టార్గెట్ చేశారు. దీంతో ప్రతిగా లేఖలతో పెదకాపులు పవన్ పై ర్యాగింగ్ కు దిగారు. లేఖలో పవన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తనను ప్రశ్నించొద్దని అనడాన్ని కాపు పెద్దలు తీవ్రంగా ఖండించారు. దీనిపై జోగయ్య, ముద్రగడలు లేఖలు రాశారు. సభలో వైసీపీని సయితం తీవ్ర స్థాయిలో పవన్ దుయ్యబట్టారు. వ్యక్తిగతాలను సయితం తవ్వి ఆరబెట్టారు. ఇందుకు తగిన విధంగా వైసీపీ స్పందిస్తోంది. పవన్ కు మతి స్థిమితం లేకుండా పోయిందన్నారు. అంతేకాదు పవన్ అధఃపాతాళం వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపుతున్నాయి. అయితే జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులను టార్గెట్ చేసినట్టు కన్పించినా సభ తర్వాత వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యలకు ఎన్కౌంటర్లు ఇవ్వడమే కాదు కొత్తగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ వ్యక్తిగతాలను తవ్వి తీశారు. ఏది ఏమైనా ఎన్నికల వేళ జరిగే సభలు సమావేశాల్లో ఇటువంటి ఆవేశకావేశాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో మరి.
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు అంగీకరించడం పట్ల పవన్ కల్యాణ్ నిన్న తాడేపల్లిగూడెం సభలో సొంత క్యాడర్ కు వివరించే ప్రయత్నం చేశారు. మనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా? టీడీపీలాగా మనకు సంస్థాగత బలం ఉందా? జగన్ లా మన వద్ద వేల కోట్లు ఉన్నాయా? బూత్ లెవల్లో మనకు కార్యకర్తలున్నారా? ఇవన్నీ ఆలోచించే 24 సీట్లకు ఒప్పుకున్నానని పవన్ వెల్లడించారు.
ఈ క్రమంలో సీఎం జగన్ ను అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రతిన బూనారు. దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ ఏమీ ఆషామాషీగా ముఖ్యమంత్రి కాలేదని స్పష్టం చేశారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు… ఊరికే అయిపోలేదుగా! అని వ్యాఖ్యానించారు.
Tdp :
ఎన్నికలకు టీడీపీ, జనసేన శ్రేణులను సిద్దం చేసేలా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రంగంలోకి దిగుతున్నారు. మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు, పోటీ చేసే అభ్యర్దుల వడపోతతో బిజిబిజీగా ఉన్న వారు.. ఇటీవల సంయుక్తంగా పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే తాడేపల్లిగూడెం లో ఈనెల 28వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు చంద్రబాబు అతిధిగా హాజరవుతున్నారు. ఇరు పార్టీల అధినేతలు ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అన్ని నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పని చేసేలా సంసిద్దం కావాలని పిలుపునివ్వనున్నారు. జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గర ఉండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇరు పార్టీల నుంచి ఈ సభ విజయవంతం చేసే విధంగా ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసి.. అందరూ కలిసి పని చేసే మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సభకు మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో వారికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మంచి నీరు, మజ్జిగ, ఇతర అల్పాహారాన్ని అందించేలా వాలంటీర్లను నియమించారు. “ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా రెండు పార్టీలూ నిర్వహించబోయే ఈ సభకు ‘తెలుగు జన విజయకేతనం.. జెండా’గా నామకరణం చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయపు జెండా కావాలని, 28వ తేదీన జరగబోయే సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరు పార్టీల అధినేతలు తమ ప్రణాళికను వెల్లడిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తును మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని, వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ప్రజలంతా తమకు అండగా ఉంటారని, ఈ ఉమ్మడి సభ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశా నిర్దేశంగా మారబోతుందన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇక ఈ సభకు లక్షల సంఖ్యలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని భావిస్తున్నారు. సువీశాల ప్రాంగణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకని పకడ్పందీగా బారికేడ్ల ను కడుతున్నారు. ఇక స్టేజి దగ్గర నుంచి వెనుక వరకు గ్యాలరీలను నిర్మించి.. అందులో నిర్దేశించిన వారిని మాత్రమే అనుమతిస్తారు. జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు అలాగే వీర మహిళలు, తెలుగు మహిళలు సంయుక్తంగా ఈ సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇరు పార్టీల నుంచి నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించడం విశేషం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సంక్షేమం అభివృద్ధి అనే ఉమ్మడి పార్టీల అజెండాను ప్రజలకు అర్థమయ్యేలా ఈ సభలో వివరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
జనసేన, టీడీపీ ఉమ్మడి గా జెండా పేరుతో నిర్వహించే ఈ సభ ద్వారా తమ అజెండాను ప్రజలకు వివరించడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, జగన్ చేసిన మోసాలు, మాయలను కూడా చంద్రబాబు, పవన్ లు వివరించనున్నారు. ఇక సిద్దం సభల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాుతున్న జగన్ వ్యాఖ్యలకు కూడా తమదైన శైలిలో ఈ జెండా సభ ద్వారా సరైన బదులు చెబుతారని టీడీపీ, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.
Read Also…
ఈ నెల 28 వ తేదిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడులో జనసేన, టీడీపీ మొదటి ఎన్నికల సంయుక్త ప్రచార సభ నిర్వహిస్తున్నామని, ప్రత్తిపాడు నియెజకవర్గ వ్యాప్తంగా జనసైనికులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు పిలుపునిచ్చారు.
సంయుక్త ప్రచారసభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తరలిరావాలని కోరారు. సుమారు 15 లక్షల మంది జనసైనికులు హాజరయ్యే అవకాశం వుందని తెలిపారు.
జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా జనసేన,టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలన్నారు.