సీఎం జగన్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారుమాధవ నాయుడు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం ప్రజలను ఎమ్మెల్యే మూడు సార్లు మోసగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కోసం జిల్లా కేంద్రంను తాకట్టు పెట్టారు. నరసాపురం నుంచి భీమవరానికి జిల్లా కేంద్రం తరలించారు. ఈ విషయం భీమవరం లో జరిగిన సీఎం సమావేశంలో పలువురు మాట్లాడారు. నరసాపురంలో మంజూరైన మెడికల్ కాలేజీను తరలించారు. రూ. 3,200 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రజలను దగా చేశారు. 14 నెలలు గడిచినా బటన్ నొక్కిన పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజలకు సిఎం, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో కు విన్నతి పత్రం అందజేశారు.
West Godavari
ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపించారు. వైయస్సార్ జగనన్న భూసురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాల భూమిని సర్వే అధికారులు, సిబ్బంది ఎక్కువగా చూపుతున్నరని గ్రామస్తులు తెలియజేశారు. గ్రామంలో మొత్తం 2వేల 900 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం సర్వే అనంతరం 3వేల 300 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోయారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపించారు. గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని వాపోతున్నారు. గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు, పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు, రైతులు తెలిపారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కెనాల్ రోడ్ లో సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతరలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అమ్మవారి ఊరేగింపులో తలెత్తిన వివాదంలో ఒక వర్గంపై మరో వర్గం కర్రలు కారం చల్లి దాడి చెయ్యడంతో ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు ఇరువర్గాలను చేదరగొట్టడం తో వివాదం సద్దుమణిగింది.
అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు రామాలయంలో వేద పండితులు శేషాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని భారీ అన్న సమారాధన నిర్వహించారు. పాత బజార్ రామాలయంలో శోభాయాత్ర, ఆర్యవైశ్య రామాలయంలో రామ జపం , హనుమాన్ చాలిస్ పఠించారు. అనంతరం పలు రామాలయాల్లో దీపాలు వెలిగించి రామ జప నామాన్ని పఠించారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. గ్రామ శివారు పొలాల్లో గుర్తుతెలియని పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. అది పులి అడుగుజాడలుగా గ్రామస్తులు భావిస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. పొలంలోకి వెళ్లి సాగు చేసుకోవడానికి ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తమ గ్రామంలోకి పులి వస్తుందేమే అనే భయంతో బిక్కుబిక్కున బతుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి తమకు రక్షణ కల్పించాలని మరియు పులిని పట్టుకుని మా గ్రామాన్ని రక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేశామని గ్రామస్తులు చెపుతున్నారు.
చలో అమరావతి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి వెళ్తున్న అంగన్వాడీలను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మేము ఏమి తప్పు చేశామని శాంతియుతంగా వెళ్తున్న మమ్మల్ని అన్యాయంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని అంగన్వాడీలు మండిపడ్డారు. గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న మమ్మల్ని పట్టించుకోని ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మమ్మల్ని అన్యాయంగా రోడ్డుపాలు చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు కూడా వచ్చేలా చేశారని వారు అన్నారు. మాకు వచ్చే 11500 జీతంతో ఏ కుటుంబమైన గడుస్తోందన అని, మమ్మల్ని ఇక్కడ ఆపినంత మాత్రాన ఉద్యమం ఆగదని కచ్చితంగా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో విన్నర్ గా హర్యానా, రన్నర్ గా రాజస్థాన్, మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ జట్టు నిలిచాయి. మహిళా విభాగంలో విన్నర్ గా కలకత్తా, రన్నర్ గా కేరళ మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, హిమాచల్ జట్లు నిలిచాయి. ఫైనల్స్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ షీల్డ్ లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్, టిడిపి నాయకులు కోవ్వలి నాయుడు, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీర లంకయ్యలు అందించారు.
మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు దివంగత యూవీ కృష్ణంరాజు జయంతి వేడుకలు స్వగ్రామం మొగల్తూరులో అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పెద్ద కుమార్తె ప్రసిద్ధ లు పాల్గొని కృష్ణంరాజు బర్త్ డే కేక్ ను కట్ చేశారు. అనంతరం యూకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ మెగా వైద్య శిబిరాన్ని మొగల్తూరు స్థానిక అందే బాపన్న కళాశాల నందు ఏర్పాటు చేశారు. ఈ వైద్యం శిబిరంలో యూకేపి చెందిన ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు కె వేణు ప్రముఖ భీమవరం హాస్పిటల్ వర్మ తదితర ప్రముఖ డాక్టర్లు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. డయాబెటిక్ పేషెంట్లను ఎడాప్ట్ చేసుకుని వారికి జీవితకాలం వైద్య సదుపాయం అందిస్తామని డాక్టర్ వేణు తెలిపారు. కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా వారి స్వగ్రామం మొగల్తూరులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవి నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు చేసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి కృష్ణంరాజు అని గుర్తు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు లో ఘనంగా మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు రెబల్ స్టార్ యు.వి.కృష్ణంరాజు జయంతి వేడుకలు. స్వగ్రామం మొగల్తూరు లో జయంతి వేడుకల్లో పాల్గొన్న భార్య శ్యామల దేవి, కుమార్తె ప్రసిద్ధ. కృష్ణంరాజు నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసిన కృష్ణంరాజు భార్య, కుమార్తె. కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు లో ఉచిత షుగర్ వ్యాధి మెగా వైద్య శిబిరం.
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని బాగు జయరామ్ అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వారి ఆక్షన్ లో ఎర్ర గోపు వెంకట సుశీల ఆస్తిని ఆగస్టు నెలలో ఆక్షన్ లో కొనగా బ్యాంకు వారు నవంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలలుగా ఖాళీ చేయకపోవడంతో గురువారం ఉదయం పోలీసు వారు బ్యాంకు వారు సహకారంతో జయరామ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో సాయంత్రం ప్రహరీ గోడను ప్రోక్లైనర్ తో తొలగిస్తుండగా సుశీల భర్త బకెట్లతో పెట్రోల్ తీసుకొచ్చి జెసిబి పైన, వచ్చిన వారిపైన వెదజల్లగా భయానికి లోనై జయరాం అతని మిత్రులు పారిపోగా జెసిబి డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో జెసిబి డ్రైవర్ కేకలు పెడుతూ రోడ్డు మీద పరుగులు పెడుతుండగా గమనించి మంటలు ఆర్పి హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అని బంధువులు తెలిపారు. సుశీల భర్తను వన్ టౌన్ పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు.