తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. అయ్యప్ప జ్యువెల్లరీ తాకట్టు షాపు తాళం పగులగొట్టారు. విలువైన ఆభరణాలను అపహరించారు. సుమారు 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గోకవరం మండలం కొత్తపల్లిలో ఇలాంటి ఘటన మరువక ముందే మరోటి చోటుచేసుకుంది. దీంతో వ్యాపారులు హడలిపోతున్నారు.