Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Sports ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయం

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయం

by Satya
Another win for Mumbai Indians in IPL 2024

ఐపీఎల్ 2024(IPL 2024)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)ని పాండ్యా సేన చిత్తుచిత్తుగా ఓడించింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లను చితక్కొట్టారు.

ఇది చదవండి: GT vs PBKS IPL 2024 | గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్ 69 పరుగులు, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 52 పరుగులు విధ్వంసం సృష్టించారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరికి తోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 38 పరుగులు, చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 21 పరుగులతో రాణించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్లు తేడాతో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

040023
Total views : 202997

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: