Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Political అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

by Satya
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏకంగా రెండేళ్ల తర్వాత మళ్లీ స్వామి వారి మూలవిరాట్టుని సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్వామివారి మూలవిరాట్‌ మూర్తిపై సూర్యకిరణాలు నేరుగా పడే మహత్తర ఘటన ఈ రోజు ఉదయం 6:05 గంటలకు ఆవిష్కృతమైంది. దాదాపు 2 నిమిషాల పాటు కనువిందు చేసిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ స్వరూపం దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనిమిచ్చింది. కాగా ఈ దృశ్యం రేపు బుధవారం నాడు కూడా మళ్లీ ఆవిష్కృతం కానుంది.

శ్రీకాకుళంపట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ మూర్తి తన భక్తులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూలవిరాట్‌ను నేరుగా తాకుతాయి. అయితే వాతావరణ సమస్యల వల్ల రెండేళ్లుగా ఈ సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించకలేకపోయాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
    వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
  • Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014590
Total views : 80523

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.