జమ్ము-కశ్మీర్ లో నేడు మలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జమ్ముతో కలిపి మొత్తం 7 జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 415 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలువగా వీరిలో మాజీ డిప్యూటీ సీఎంలు తారా చంద్, ముజఫర్ బేగ్ లు ఉన్నారు. 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కశ్మీర్ లోయలోని బారాముల్లా, ఉరి, రఫియాబాద్, పఠాన్, గుల్ మార్గ్, సోపోర్, కుప్వారా, కర్ణా, త్రెహ్గం, హంద్వారా, లోలాబ్, లాంగేట్, బందిపొరా, సోనావరి, గురేజ్, వగూరా క్రీరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ భద్రత నడుమ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జమ్ములో 24 ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో వెస్ట్ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్భా తెగలకు చెందినవారు ఓటు వేయనున్నారు. 5,060 పోలింగ్ కేంద్రాల్లో 20 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు ప్రశాంతంగా కశ్మీర్ తుది విడత ఎన్నికల పోలింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.
జమ్ము-కశ్మీర్ లో మలివిడత ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ X వేదికగా ట్వీట్ చేశారు. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరారు. అలాగే తొలిసారి ఓటు వేసే యువతతో పాటు మహిళలు కూడా పెద్దఎత్తున ఓటు వేసేందుకు తరలి వెళ్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
- Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
- Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80459