414
నేటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఏటీఎం వినియోగదారులకు పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. వివిధ బ్యాంకులు నగదు ఉపసంహరణ పరిమితులు, ఛార్జీలలో మార్పులు చేశాయి. బ్యాంకింగ్ నిబంధనల్లో భాగంగా కొత్త పరిమితులను అమలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఉచితంగా లభిస్తున్న కొన్ని సేవలపై ఇక నుంచి ఛార్జీలు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ATMలలో కార్డ్‌లెస్, యూపీఐ లావాదేవీలపై ఫీజులు విధించనున్నారు. అలాగే యాప్‌లలో పదేపదే బ్యాలెన్స్ చెక్ చేసినా అదనపు చార్జీలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.