నల్గొండ జిల్లా నార్కాట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నార్కాట్ పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు.. అక్కడికి వెళ్లిన అశోక్ పై.. కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నగదు పంపిణీని తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న అశోక్ పై దాడికి యత్నిస్తూ ఆయన సెల్ ఫోను ధ్వంసం చేశారు. నగదు పంపిణీ వ్యవహారం తనపై దాడికి సంబంధించి.. అశోక్ నార్కాట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన సందర్భంలోనూ పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడాన్ని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి న్యాయం చేయాలని అశోక్ డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
- బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.