అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్దవట్టం, రాజంపేట, నందలూరు మండలాల నుంచి పెద్దఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. వారు యల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని, భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన, టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. జనసేన టిక్కెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా, సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు యల్లటూరి శ్రీనివాసరాజును సుగవాసి కొనియాడారు.
Prakash
పాతబస్తీ కబూతర్ ఖానా లో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకుని ఆత్మ హత్య(RSI Suicide) చేసుకున్న ఘటన హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) అచ్చం పేట్ మండలం లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ (48) మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్. విధుల నిర్వహణలో భాగంగా బాలేశ్వర్ శనివారమే మహబూబ్ నగర్ 10 వ బెటాలియన్ నుండి పాతబస్తీకి వచ్చాడు. ఆరు నెలలు పాతబస్తీలోనే విధులు నిర్వహించాల్సి ఉండగా విధులకు వచ్చిన రెండవ రోజే ఆదివారం తెల్లవారు జామున డ్యూటీ లో ఉన్న రిజర్వ్ ఎస్ఐ బాలేశ్వర్ ఎస్ఎల్ఆర్ గన్‌తో గురిపెట్టుకుని కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఈ వేసవి సెలవుల్లో మెట్రో రైలులో రాయితీ కార్డు మీద నగరాన్ని చుట్టేసి రావాలనుకుంటోన్న వారికి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయితీ కార్డులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాయితీ ప్రయాణాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలులో 59 రూపాయల హాలిడే కార్డు అమలులో ఉండేది. ఈ రాయితీ కార్డును అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. దీనితో పాటు సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకొచ్చిన 10 శాతం రాయితీని కూడా ఎత్తేసినట్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే – తెల్లవార జామున 6 నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో కల్పించే 10 శాతం రాయితీ ఉండేది. దీన్ని సైతం అధికారులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగినందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పల్నాడుజిల్లా, Palnadu…
చంద్రబాబు పై ఎమ్మెల్యె నంబూరి శంకర్రావు(MLA Namburi Shankar Rao) అగ్రహాం
క్రోసూరులో చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం(Praja galam) సభ అట్టర్ ప్లాప్. గతంలో ఏం చెప్పారు అదే చెప్పారు. 6నెలలో మూడు సభలు పెట్టారు. మూడు సభలు పేర్లు మార్చారు. పెదకూరపాడు టీడీపీ కొత్త అభ్యర్థి రాసింది చంద్రబాబు చదివి విన్పించారు. తెలంగాణ, ఆంధ్ర లో అన్ని నేను చేశానంటు చంద్రబాబు ప్రగాల్భాలు పలికారు. పెన్న,గోదవరి అనుసంధానం చేయలేకపోయారు,పటీసీమ,పోలవరం ప్రాజెక్టులు అవినీతి చేశారు. చంద్రబాబు 14ఏళ్లలో ఒక ప్రాజెక్టు తెచ్చారా. నిర్మించారా.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అమరావతి-బెల్లంకొండ రోడ్డు పనులు జరుగుతున్నాయి. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి. పెదకూరపాడుకు ఐటీ కంపెనీ పెడతామని చంద్రబాబు మాటలు హాస్యస్పదంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు మైండ్ పోయి మాట్లాడుతున్నారు. ఇసుకకు నాకు ఎలాంటి సంబధం లేదు. రోజుకు30కోట్లు వస్తున్నాయంటు చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు. ఇసుక పై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబును గెలిపిస్తే రెండు ఏళ్లు అసెంబ్లీకి రాకుండా పారిపోయిన పిరికిపంద.
చంద్రబాబుకు నాగురించి మాట్లాడే అర్హత లేదు- నంబూరిశంకర్రావు
ఎన్నికలు నేరుగా ఎదుర్కోలేక సిగ్గులేకుండా పోత్తులు పెట్టుకున్నారు. మీడియా లేకపోతే చంద్రబాబు రాజకీయండా బతికిఉండేవారు కాదు. చంద్రబాబు కాంగ్రెస్ లో ఒడిపోతే సిగ్గులేకుండా టీడీపీ లో చేరిన వ్యక్తి. చంద్రబాబుకు పార్టీ లేదు. ఎన్టీఆర్ వచ్చి పార్టీ లాకుంటారు. లోకేష్ కోసం చంద్రబాబు ఎంతోమందిని బలిచేశారు. రెండు నెలల తర్వాత టీడీపీ అడ్రాస్ లేకుండా పోతుంది. చంద్రబాబుకు ఇవే చివరిఎన్నికలు. అమరావతి లో చంద్రబాబు, పవన్ లకు సోంత ఇళ్లు లేదు. రెండు నెలల తర్వాత దూకాణం బంద్ చేసి హైదరాబాద్ వెళ్తారు. భాష్యం ప్రవీణ్ కు నియోజకవర్గంలో ఏరోడ్లు ఎక్కడో తెలియదు. చంద్రబాబు పెద్ద దోంగ. నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమని అడుగుతున్నా. జగన్ దమ్మున నాయకుడు. చంద్రబాబు మాదిరిగా దోంగ మాటలు చెప్పడం రాదు. పెదకూరపాడు లో శంకర్రావును ఏం చేయలేరు.
-వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు. దేశంలో విభజన వాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు. శనివారం జోరాట్ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీలకు నిదర్శనం. మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే.. భారత్‌లో ఎన్నికల కంటే పాకిస్తాన్లో ఎన్నికలు సరిపోయేటట్టు ఉంది. సమాజంలో విభజన చిచ్టుపెట్టి అధకారంలోకి రావాలనుకోవటమే కాంగ్రెస్ స్వాభావం. అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. భారత దేశాన్ని విశ్వగురువుగా మర్చేందుకు బీజేపీ ఉద్యమాన్ని చేపట్టింది’ అని హిమంత అన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పార్టీలు మారే హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీ లైకిక, సమ్మిలిత తత్వం అస్సలు అర్థం కావని కౌంటర్ ఇచ్చింది.
మాది మైలవరం నియోజకవర్గమేనని, మా నాయనమ్మ గారిది ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామమని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, ఐటీడీపీ సత్తాను చాటాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఐటీడీపీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ, అపసవ్య విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై కక్ష్య కట్టి అభివృద్ధిని విస్మరించి రాష్ట్రప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వారందరికీ ఉపాధి లేకుండా చేశారన్నారు. కులాల మధ్యన చిచ్చు పెడుతూ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందటానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని ఐటీడీపీ సభ్యులందరూ తిప్పికొట్టాలన్నారు.
ఆత్మహత్య చేసుకున్న నేతన్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి బండి సంజయ్ నివాళులర్పించి, లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పని లేక లక్ష్మినారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని, కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే, నేతన్నలను ఆదుకోవాలని ఎవరకి లేదని మండిపడ్డారు. నేతన్నలు పని కల్పించాలని రొడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఆత్మహత్యలను ఆపడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి, పాత బకాయిలు విడుదల చేసి, కొత్తగా బతుకమ్మా చీరల ఆర్డర్ లు ఇవ్వాలిని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకం అన్నారు, అది ఏక్కడికి పోయిందో ఎవరికి తెలియదని విమర్శించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంకు పరిష్కారం చూపించడానికి అందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మృతిని కుటుంబానికి ప్రభుత్వం స్పందించి ఆర్ధికసాయం చేయాలని సూచించారు.
చదువు ఆపేసి.. చెడు వ్యసనాలకు అలవాటు పడి… అసలేం జరిగిందంటే?
మంచిగా చదువు కుంటే వేలల్లో ఉద్యోగం దొరికేది…చదువు మధ్య లో ఆపేసి చెడు వ్యసనాలకు అలవాటు పడి రౌడీ లాగా తయారు అయ్యి.. రొడ్దన పోయే వారిని బెదిరించి, కొడుతూ ఉంటే.. అడ్డు వెళ్లిన 8నెలల నిండు గర్భిణీ పై దాడి చేసిన వైనం..
ఏపీ లో రౌడీయిజం(Kurnool Crime) రంకెలు వేస్తుంది. కొంతమంది యువకులు చదువు సంద్యలు లేక రోడ్లపై జులాయిలా తిరుగూత రౌడీయిజం చేస్తూ అమాయకులను బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఎదురు తిరిగిన వాళ్లపై మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు హత్యలకు పాల్పపడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీరిలో మార్పు రావడం లేదు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నంద్యాల జిల్లా | Kurnool Crime
డోన్ లో కొంతమంది గ్యాంగ్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఆర్ఎంపీ బాలు గ్యాంగ్(Balu Gang) పలు దారుణాలకు తెగబడుతున్నారు. తనకు అడ్డు వచ్చిన వాళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ పలుమార్లు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కేస్తున్నాడు.
ఇప్పటికే బాలుపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల ఆయనకు వ్యతిరేంగా వాదిస్తున్న లాయర్ పై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన మరువక ముందే.. శుక్రవారం రాత్రి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మంజిరాబాదు లో తాగిన మైకంలో బారులో వస్తువులు ధ్వంసం చేస్తుండగా ప్రభాకర్ అనే ఉద్యోగి అడ్డుకున్నాడు. ఆ సమయంలో బాలు చేతికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.
చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు…
ఉదయం 7 గంటల ప్రాంతంలో బాలు తన అనుచరులతో ప్రభాకర్ తమ్ముడు విజయ్ ఇంటిపై కత్తులు, ఇనున రాడ్లు, బీరు సీసాలతో వెళ్లి దాడికి తెగబడ్డాడు. ఆ సమయంలో 8 నెలల గర్భవతి అయిన విజయ్ భార్య అడ్డు వచ్చింది. తన భర్తను ఏం చేయవొద్దని ప్రాదేయపడింది. కానీ దుర్మార్గుడైన బాలు అతని అనుచరులు గర్భవతి అని చూడకుండా ఆమెపై కూడా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి బాగాలేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలు గ్యాంగ్ పై కేసు నమదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం బాలు అతని గ్యాంగ్ పరారీలో ఉన్నారని.. త్వరలో పట్టుకుంటామని పోలీసు అధికారి తెలిపారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట | Sullurpet…
సూళ్లూరుపేట మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై మెప్మా అధ్యక్షురాలు స్వప్న మరియు ఆర్పీలు మూకుమ్మడిగా దాడి. బ్యాంకు వద్దకు మెప్మా అధ్యక్షురాలు వెళుతుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మిషన్ మేనేజర్ పై దాడికి దిగిన మెప్మా అధ్యక్షురాలు స్వప్న, భర్త దయాకర్ మరియు స్వప్న అత్త. గత 15 రోజుల క్రితం మన్నారు పోలూరు లో ఓ గ్రూపులో ఆర్పి గ్రూప్ సభ్యులకు డబ్బులు ఇవ్వకపోవడంతో సమస్య వెలుగులోకి వచ్చిన వైనం. మెప్మా అధ్యక్షులు మరియు ఆర్ పేరు కలిసి గ్రూపు సభ్యుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తున్నట్లు సమాచారం.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిటీ మిషన్ మేనేజర్(City Mission Manager) కి విషయం తెలియడంతో అధ్యక్షరాల్ని బ్యాంకు వద్దకు వెళ్లొద్దని చెప్పినప్పటికీ నువ్వు ఎవరు చెప్పడానికి అని ఆర్పీలు అధ్యక్షులు దాడి చేసినట్లు వెల్లడించిన సిటీ మేనేజర్. నేడు సమావేశం జరుగుతుండగా ఒక ఆర్పి సిటీ మిషన్ మేనేజర్ ఫోన్ లాక్కోవడంతో మొదలైన వ్యవహారం. దీంతో మెప్మా అధ్యక్షురాలు అత్త సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై దాడి చేయడంతో ఇద్దరు కలబడి కొట్టుకోవడంతో ఇరువురికి గాయాలు. ఇరువురు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపడుతున్న ఎస్సై కోటా రహీం రెడ్డి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Israel-Hamas : ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన…
ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధానికి ఈ రోజుతో ఆరు నెలల కాలం పూర్తైంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడికి ఇజ్రాయెల్ ప్రతీ దాడులు చేస్తూ.. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంతో పాలస్తీనీయుల ఆర్తనాధాలు.. యావత్ ప్రపంచాన్ని ఆందోళనలకు గురి చేస్తున్నాయి. గాజా ప్రజలు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. కాగా, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. ‘ఆపరేషన్ అల్-అక్సా స్ట్రామ్’ (Operation Al-Aqsa Storm) పేరిట గతేడాది అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్ మిలిటెంట్లు.. దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు.
బందీల విడుదలే లక్ష్యంగా దాడులు…
ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్.. ప్రతి దాడులను మొదలుపెట్టింది. హమాస్ అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా దాడులను ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రతి దాడుల కారణంగా ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఆ దేశ వైమానిక దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ చెబుతోంది. తమవారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. దాదాపు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్ సొరంగాల్లో చాలావరకు ధ్వంసం చేశామని, 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. నెతన్యాహు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి : రాజమండ్రి షెల్టన్ హోటల్ లో పురందేశ్వరిని కలిసిన నల్లమిల్లి
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి