టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేశ్‌తో పాటు విజయవాడ మాజీ మేయర్ భర్తకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో సురేశ్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. ఆయన ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా కనిపించలేదు. ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వివరాలు సేకరించేందుకు సురేశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. నిన్నటితో రిమాండ్ ముగియడంతో పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్…
- నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్, నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మోసం కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ. 15 లక్షల…
- వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.వికారాబాద్ జిల్లా యాలాల్ విహారయాత్ర కోసం వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. సరదాగా ఈత కోట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగారు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం…
- కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.ఓ మహిళ కుళ్ళిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించిన ఘటన కామారెడ్డి పట్టణ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల భర్త రాజంతో కలిసి కామారెడ్డిలో కూలి పనికి వచ్చింది. అయితే రాజంకు…
- కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ.కామారెడ్డిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ధైర్యసాహసాన్ని చూపిన ఘటన చోటుచేసుకుంది. స్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేయడంతో,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92164