Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Film కెరీర్ ఫస్ట్ అవార్డు అందుకున్న ‘బేబీ’ హీరో ఆనంద్ దేవరకొండ

కెరీర్ ఫస్ట్ అవార్డు అందుకున్న ‘బేబీ’ హీరో ఆనంద్ దేవరకొండ

by Prakash
anand devarakonda at gama awards

దుబాయ్ లో ఘనంగా జరిగిన గామా అవార్డ్స్(Gama Awards)

దుబాయ్ లో ఘనంగా జరిగిన గామా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda). “బేబి” సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు గామా అవార్డ్ సొంతమైంది. ఆనంద్ కు ఇదే ఫస్ట్ బిగ్ అవార్డ్. నటుడిగా ఆనంద్ ప్రతిభకు దక్కబోయే అవార్డ్స్ కు ఇదే ఫస్ట్ స్టెప్ గా భావించవచ్చు. దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సినిమాతోనే ఒక మంచి ప్రయత్నం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి సినిమాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. సినిమా రిజల్ట్ తో పనిలేకుండా రొటీన్, రెగ్యులర్ ఫార్మేట్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన మూవీస్ చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన బేబి సినిమా ఆనంద్ దేవరకొండకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమాలో భగ్న ప్రేమికుడిగా ఆనంద్ నటన ప్రేక్షకుల మనసులను తాకింది. గామా అవార్డ్స్ లో బేబి సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కడం ఆనంద్ పడిన కష్టానికి, ఆయన నట ప్రతిభకు దక్కిన బహుమతి అనుకోవచ్చు. ఈ అవార్డ్ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి సినిమాల్లో ఆనంద్ నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన గం గం గణేశా, డ్యూయెట్ సినిమాలతో పాటు బేబి టీమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్నాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది …
‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..
దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019453
Total views : 90742

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.