Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home Andhra Pradesh గోదాములో పీడీ రైస్ మాయం… మాజీ మంత్రి భార్యపై కేసు

గోదాములో పీడీ రైస్ మాయం… మాజీ మంత్రి భార్యపై కేసు

by Rama
గోదాములో పీడీ రైస్ మాయం… మాజీ మంత్రి భార్యపై కేసు

మాజీ మంత్రి, వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్‌ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 185 టన్నుల పీడీఎఫ్‌ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి తేల్చారు. అయితే వేబ్రిడ్జి సరిగా పనిచేయడం లేదంటూ.. తప్పించుకునేందుకు వైసీపీ నేత పేర్ని నాని యత్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్‌ను నిర్మించారు. దానిని సివిల్ సప్లయిస్‌కు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్‌ను సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా స్టాక్‌లో తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు మాయమైనట్లు తేల్చారు.

పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు నమోదైంది. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయడం లేదని పేర్ని నాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల షార్టేజీ వచ్చిందని సివిల్ సప్లయిస్ అధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారు. షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
    ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
    దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
  • టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
    టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
  • ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.
    ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
  • నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .
    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: