Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడు

by Satya
రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడు

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడుమాట్లాడుతూ.. నమ్మకంతో అతిపెద్ద బాధ్యత నీకు అప్పగించాం. సమర్ధంగా నిర్వహించాలి.

అధికారంలో ఉన్నపుడు ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ తగు గౌరవం కల్పించాలి. ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలి. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. జాతీయ అధ్యక్షునిగా పార్టీ పరంగా, ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాను. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలి. పార్టీ పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తాను. సీనియర్ల సూచనలు, జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. వచ్చే నెల నుండి పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పున:ప్రారంభించాలి. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో పని చేసిన కార్యకర్తల్ని నియమించి గౌరవించాలి. అదే సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి నాయకుడికీ తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014723
Total views : 80949

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.