ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనంతపురం జిల్లాకు మొదటిసారిగా వచ్చిన పయ్యావుల కేశవకు అనంతపురం గుత్తి పట్టణంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక గాంధీ సర్కిల్లో క్రేన్ సహాయంతో పయ్యావుల కేశవకు భారీ గజమాలతో సత్కరించారు. పయ్యావుల కేశవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి పట్టణ శివారు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోగుంతకల్ ఎమ్మెల్యేజయరాం,అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్,మడకశిర ఎమ్మెల్యేఎమ్మెస్ రాజు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు,అనంతపురం ఎంపీఅంబిక లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయిన అనంతపురం జిల్లాకు ఒక కూలివాడిగా పని చేస్తానన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదించక పోయిందన్నారు. అనంతపురం జిల్లాకు త్రాగు,సాగునీరు అందించే దిశగా పనిచేస్తానన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 200992