రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ట్రిపుల్ ఆర్ భూసేకరణ, ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదాశివపేట నుంచి చౌటుప్పల్ వరకు.. ఉత్తర భాగంలో దాదాపుగా భూసేకరణ పూర్తి కావడంతో రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. భూసేకరణ పూర్తి అయ్యాక కేంద్ర అనుమతితో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు మొత్తం ఒకే నెంబర్ కేటాయించాలని కోరడంతో కేంద్ర మంత్రి గడ్కరీ ఒప్పుకున్నారని, దీంతో దక్షిణ భాగంలో కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు సీఎం రేవంత్ సుముఖత తెలిపారని మంత్రి తెలియజేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి కన్‌సల్టెన్సీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212530